లోకేశ్ కు నోటీసులిస్తారా?

44
LOKESH CONTEST FROM MANGALAGIRI
LOKESH CONTEST FROM MANGALAGIRI

T POLICE NOTICE TO LOKESH?

  • డేటా చోరీ కేసులో విచారణ వేగవంతం
  • ఇప్పటికీ విచారణకు హాజరుకాని ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్
  • లుకౌట్ నోటీసులు జారీచేసే యోచనలో తెలంగాణ పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన డేటా చోరీ కేసులో విచారణ వేగవంతమైంది. రెండు రాష్ట్రాల నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే కీలక ఆధారాలు సంపాదించిన పోలీసులు.. తదుపరి ప్రక్రియపై దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఏపీ మంత్రి నారా లోకేశ్ కార్యాలయం నుంచే ఈ డేటా మొత్తం ఐటీ గ్రిడ్స్ సంస్థకు అందినట్టుగా పక్కా ఆధారాలు లభించినట్టు సమాచారం. దీంతో నేరుగా మంత్రి లోకేశ్ కే నోటీసులు జారీచేసే అంశాన్ని తెలంగాణ పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలిసింది.

ఇప్పటికే ఐటీ గ్రిడ్ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న టీ పోలీసులు… ఆ సంస్థ అధిపతి అశోక్ కోసం చూస్తున్నారు. అయితే తన అరెస్ట్ తప్పదన్న భావనతోనే ఏపీకి పారిపోయిన అశోక్… అక్కడి పోలీసుల పర్యవేక్షణలో సురక్షితంగా ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. అశోక్ స్వయంగా లొంగిపోవాలని, లేకుంటే ఎక్కడున్నా అరెస్ట్ చేసి తీరతామని ఇప్పటికే సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ హెచ్చరించారు. ఆయన విదేశాలకు పారిపోకుండా చూసేందుకు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. అశోక్ కు విచారిస్తే ఈ కేసులో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని తెలంగాణ పోలీసులు భావిస్తున్నారు. తనకు ఈ వివరాలు ఎవరి ద్వారా అందాయి? ఈ వివరాలతో ఏం చేయాలని ప్లాన్ చేశారు? అన్న విషయాలు అశోక్ నుంచి రాబట్టాలని యోచిస్తున్నారు. అయితే అశోక్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, ఏపీ ప్రభుత్వమే ఆయనకు రక్షణ కల్పిస్తోందన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకునే దిశగా సాగుతున్నారు. తమ దర్యాప్తులో తేలిన వివరాల మేరకు నేరుగా లోకేశ్ కే నోటీసులు జారీ చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై సమాలోచనలు జరుపుతున్నారు. మొత్తమ్మీద ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగ అవకాశం కనిపిస్తోంది.

AP POLITICS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here