ఆ సీనియర్ యాక్టర్ నమిత లవర్…

T Rajendar’s next movie with Namitha

నమిత.. చబ్బీ బ్యూటీగా కోలీవుడ్ లో అద్బుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బ్యూటీ. తెలుగులోనే సొంతం సినిమాతో పరిచయమైన ఈ భామ జెమిని, ఒకరాజు ఒక రాణి, బిల్లా, సింహా వంటి సినిమాలతో తన భారీ అందాలతో ఆకట్టుకుంది. కాకపోతే తెలుగులో తనకు పెద్దగా స్టార్డమ్ రాలేదు. ఇక ఇలాంటి భామలకు ఆలయాలు కట్టే తమిళియన్స్ కు అమ్మడి భారీ సోయగాలు తెగ నచ్చాయి. అందుకే ఓ దశలో గుడి కూడా కట్టేస్తారా అన్నంతగా అభిమానించారు. కొన్ని బి గ్రేడ్ సినిమాల్లో సైతం కనువిందు చేసిన నమిత కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. అయితే లేటెస్ట్ గా తను ఓ సినిమాలో నటించింది. అందులో తన సరసన హీరోగా నటించిందెవరో తెలుసా..?

సౌత్ ఇండియాలోనే రేర్ టాలెంటెడ్ అనిపించుకున్న నటుడు, దర్శకుడు, నిర్మాత, రైటర్, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, మ్యూజిసియన్, సింగర్.. ఇలా ఎన్నో రంగాల్లో ప్రతిభ చూపించిన టి రాజేందర్. యస్.. 2007లో చివరి సారిగా తన డైరెక్షన్ లో సినిమా చేసిన రాజేందర్ లేటెస్ట్ గా మరోసారి మెగాఫోన్ పట్టాడు. ‘ఇదుధాన్ కాదల్’ అనే టైటిల్ తో సినిమా తీసేశాడు. ఇందులో నమిత అతనికి పెయిర్ గా కనిపిస్తుంది. ఇప్పుడెలాగూ వీళ్లను లవర్స్ అనలేరు కాబట్టి.. ఇదో ముదురు ప్రేమకథ అని చెబుతున్నారు. ఇక రాజేందర్ ఇందులో సింగర్ గా కనిపిస్తాడట. నమిత మోడల్. మరి ఈ ఇద్దరూ ఎక్కడ ఎలా కలిశారు.. ప్రేమలో పడటానికి కారణాలేంటీ అనేది కథ. మొత్తంగా ఈ సీనియర్ యాక్టర్ భలే సినిమా చేస్తున్నాడుగా..?

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article