Saturday, December 28, 2024

టి-సాట్ కార్యాలయాన్ని సందర్శించిన పిసిసి అధ్యక్షుడు

టి-సాట్ (తెలంగాణ శాటిలైట్ స్కిల్ అండ్ అకాడమిక్స్) కార్యాలయాన్ని ఎమ్మెల్సీ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శనివారం సందర్శించారు. సిఈఓ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఆహ్వానం మేరకు టి-సాట్ కార్యాలయానికి మహేష్ కుమార్ గౌడ్ వెళ్లారు. కార్యాలయ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ సీఈఓ వేణుగోపాల్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడు అభినంధించారు. తొలిసారి టి-సాట్ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్సీ, పిసిసి అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ ను సీఈఓ వేణుగోపాల్ రెడ్డి ఘనంగా సత్కరించి, సన్మానించారు. అనంతరం కార్యాల యంలోని వివిధ విభాగాలను సిఈఓతో కలిసి పిసిసి అధ్యక్షుడు పరిశీలించారు. టి-సాట్ పనితీరుకు సంబంధించిన వివరాలను పిసిసి అధ్యక్షుడు అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా టి-సాట్ నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ పరంగా అవసరమై సహకారాన్ని అందిస్తానని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com