ISTA 2019 LATEST UPDATES
- ప్రభుత్వ విత్తనరంగ సంస్థల బలోపేతం
- ప్రైవేటుకు ఊతమిస్తూనే ప్రబుత్వ సంస్థలకు ప్రాధాన్యం
- కేసీఆర్ గారి కృషితో తెలంగాణ విత్తన రంగం అభివృద్ది
- నాణ్యమయిన విత్తనమే వ్యవసాయాభివృద్దికి మూలం
- విత్తనోత్పత్తిపై రైతులకు శిక్షణా తరగతులు
- విత్తన నాణ్యత, సరఫరా పెరిగేందుకు మరిన్ని పరిశోధనలు జరగాలి
- ఆధునిక శాస్త్రీయతను విత్తనానికి ఆపాదించాలి
- ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న సంస్థలలో విత్తన పరిశ్రమ ఒకటి
- తెలంగాణ ప్రపంచ విత్తన భాండాగారంగా ఎదిగేందుకు సదస్సు దోహదం చేస్తుంది
- ఇప్పటికే విత్తనోత్పత్తికి చిరునామాగా తెలంగాణ ఎదిగింది
- ఐరోపా దేశాలకు త్వరలో విత్తనాల ఎగుమతి
- ఇప్పటికే ఓఈసీడీ విత్తన దృవీకరణ వ్యవస్థ ద్వారా పలు దేశాలకు తెలంగాణ నుండి విత్తనాల ఎగుమతి
- అంతర్జాతీయ విత్తన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
భారతదేశ విత్తన పరిశ్రమలో తెలంగాణ పెద్దన్న పాత్ర పోషిస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషితో గత ఐదేళ్లలో తెలంగాణ విత్తనోత్పత్తికి చిరునామాగా మారిందని, ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణఎదిగేందుకు అంతర్జాతీయ విత్తన సదస్సు దోహద పడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అన్నారు. హైదరాబాద్ నోవాటెల్ లో బుధవారం అంతర్జాతీయ విత్తన సదస్సుకు ఆయనగౌరవ అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణలో ప్రైవేటు విత్తనరంగ సంస్థలకు ప్రభుత్వపరంగా సహకారం అందిస్తూనే, ప్రభుత్వ విత్తన రంగ సంస్థలను బలోపేతం చేస్తామని, నాణ్యమయిన విత్తనమేవ్యవసాయాభివృద్దికి మూలం అని, విత్తన నాణ్యత, సరఫరా పెరిగేందుకు మరిన్ని పరిశోధనలు జరగాలని నిరంజన్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న సంస్థలలో విత్తనపరిశ్రమ ఒకటి అని, ఆధునిక శాస్త్రీయతను విత్తనానికి ఆపాదించి నాణ్యమయిన విత్తనాలను రూపొందించాలని, తెలంగాణ నుండి ఏడాదికి 65 లక్షల క్వింటాళ్ల విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు.
ఇప్పటికే విత్తనోత్పత్తికి చిరునామాగా తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని, ఇప్పటికే ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ & డెవలప్ మెంట్) విత్తన దృవీకరణ వ్యవస్థ ద్వారా పలు దేశాలకు తెలంగాణ నుండివిత్తనాల ఎగుమతి కొనసాగుతుందని, ఐరోపా దేశాలకు కావలసిన విత్తనాలను దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయని, భారతదేశం నుండి విత్తనాలను ఎగుమతి చేసేందుకు అన్ని రకాలపరీక్షలు పూర్తి చేసుకున్నామని, త్వరలోనే దీనికి సంబంధించిన అనుమతులు రాగానే తెలంగాణ నుండి విత్తనాలను ఎగుమతి చేయడం ప్రారంభిస్తామని నిరంజన్ రెడ్డి గారు అన్నారు. విత్తనోత్పత్తిపై రైతాంగానికిశిక్షణా తరగతులు నిర్వహిస్తామని, వారికి మౌళిక సదుపాయాల కల్పనతో పాటు, సాంకేతిక సహకారం అందిస్తామని, రైతులకు విత్తనోత్పత్తిలో సహాయంగా ఉండే పాలసీలను తీసుకువస్తామని మంత్రి గారు స్పష్టంచేశారు. తెలంగాణ విత్తనోత్పత్తిలో కీలకంగా ఎదిగేందుకు ప్రభుత్వ పాలసీలతో పాటు ఇక్కడి అనుకూల వాతావరణం, తెలంగాణ రైతుల శ్రద్దతో పాటు పరిశోధనా సంస్థల సహకారం ఉందని, మానవ మనుగడకుఅంత్యంత కీలకం ఆహార పంటల సాగు అని, అందులో ప్రధాన భూమిక విత్తనాలది అని, నాణ్యమయిన విత్తనాలు లేకుంటే ఇది సాధ్యం కాదని అన్నారు. సదస్సుకు ఇస్టా ప్రెసిడెంట్ డాక్టర్ క్రెగ్ మెక్ గ్రిల్, జాతీయవిత్తన సంయుక్త కార్యదర్శి అశ్వనీకుమార్, జాతీయ కార్యదర్శి సంజయ్ అగర్వాల్, వ్యవసాయ కమీషనర్ రాహుల్ బొజ్జా, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్ రెడ్డి, యాదయ్య, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు, వేర్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ మందుల సామేలు, టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు, ఆగ్రోస్ చైర్మన్ కిషన్ రావు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు వందన సమర్పణతో తొలిరోజు సదస్సు ముగిసింది. గురువారంసదస్సులో కీలకమయిన విత్తనోత్పత్తి రైతుల సమావేశం జరగనుంది.