మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు

హైదరాబాద్: సికింద్రాబాద్ మహంకాళి ఆలయ పరిసరాలలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను జీహెచ్ఎంసి కమిషనర్ లోకేష్, వాటర్ వర్క్స్ ఎండీదాన కిషోర్ ఇతర అధికారులతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ నెల 17 న నిర్వహించే సికింద్రాబాద్ బోనాలకు లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నాం. బోనాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని అన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article