కమలంలోకి ఖుష్బూ

45
Tamil actress Kushboo join in BJP
Tamil actress Kushboo join in BJP

Tamil actress Kushboo join in BJP

తమిళ నటి ఖుష్బూ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో ఎందుకు చేరానో వివరణ ఇచ్చారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులుండరని సమర్థించుకున్నారు. ఫిబ్రవరిలోనే అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపామని, అయితే వ్యక్తిగతంగా మాత్రం కలవలేకపోయానని ఆమె తెలిపారు. కాంగ్రెస్‌లో కొందరు తనను అణచివేశారని ఆరోపించారు. ఎవరు అణచివేశారో వారి పేర్లు తెలిపేందకు మాత్రం ఇష్టం చూపలేదు. అయితే.. సోనియాకు రాసిన లేఖలో మాత్రం పూర్తి వివరాలను వెల్లడించినట్లు పేర్కొన్నారు.

కాంగ్రెస్ లో ఉన్న సమయంలో కొందరు తనను తీవ్రంగా అవమానించారని, అయినా వాటన్నింటినీ సహిస్తూ వచ్చానని తెలిపారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి కూడా తీసుకెళ్లానని అయినా లాభం లేకుండా పోయిందని విమర్శించారు. బీజేపీలో చేరడం ఏమాత్రం రాజకీయ ఎత్తుగడ కాదని అన్నారు. ముఖ్యంగా రాహుల్… ఆయన చుట్టూ ఆ కోటరీని ఏర్పర్చుకున్నారు. అందుకే బీజేపీలో చేరినట్లు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here