తమిళ నటుడు వివేక్ మృతి

TAMIL ACTOR VIVEK EXPIRED IN SIMS HOSPITAL ON SATURDAY. TAMIL FILM INDUSTRY AND POLITICAL LEADERS ARE SHOCKED AFTER HEARING THIS SAD NEWS.

185
Tamil comedy actor Vivek Serious?
Tamil comedy actor Vivek Serious?

తమిళ హాస్య నటుడు వివేక్ శనివారం మరణించారు. శుక్రవారం గుండె నొప్పి రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సిమ్స్ డాక్టర్లు యాంజియోగ్రామ్ మరియు యాంజియోప్లాస్టీ చేశారు. ఆయన్ని బ్రతికించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు. చివరకూ ఆయన మరణించారని ధృవీకరించారు. దీంతో, ఒక్కసారిగా తమిళ సినీ పరిశ్రమ మొత్తం షాక్ కు గురైంది. అగ్ర నటులు రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య తదితరులంతా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. వివేక్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వివేక్ కుటుంబానికి సంతాపం తెలిపారు. వివేక్ మరణించడాన్ని నమ్మలేకపోతున్నానని ఏఆర్ రహమాన్ ట్వీట్ చేశారు. ఏళ్ల తరబడి తమల్ని ఎంటర్ టైన్ చేసిన వ్యక్తి ఈ రోజు లేడంటే నమ్మలేకపోతున్నానని అన్నారు. నోటి మాటలు రావడం లేదని రాధికా శరత్ కుమార్ అన్నారు. 1980లో బాలాచందర్ సినిమా ద్వారా తమిళ పరిశ్రమలో అడుగుపెట్టిన వివేక్ అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయ్యారు. తను చేసిన చివరి సినిమా ధరళ ప్రభు, హింది సినిమా విక్కీ డోనర్ కు రిమేక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here