గవర్నర్ కు మాతృవియోగం

151
Tamilasai Soundarajan mother expired
Tamilasai Soundarajan mother expired

గవర్నర్ మాతృమూర్తి శ్రీమతి కృష్ణ కుమారి ( 77) అనారోగ్యంతో ఈరోజు ఉదయం సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో పరమపదించారు. గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఈరోజు మధ్యాహ్నం వరకు పార్థివ శరీరం రాజ్ భవన్ లో ఉంచుతారు. తర్వాత ఆంత్యక్రియల కోసం చెన్నై తరలిస్థారు. రాష్ట్ర గవర్నర్ మాతృమూర్తి మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్ కుటుంబ సభ్యులకు ‘సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్ర గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ గారిని కలిసి ఆమె మాతృమూర్తి మృతికి నివాళి అర్పించనున్న మంత్రి కే. తారకరామ రావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here