TAPSEE STARTS RUNNING
తాను ఏ సినిమా చేసినా రూపకర్తలు తన పాదాన్ని ఒక చోట ఉండనివ్వరని, ఎప్పుడూ పరుగులు తీయిస్తూనే ఉంటారని అంటున్నారు తాప్సీ. అది లవ్ సినిమా అయినా, యాక్షన్ సినిమా అయినా అంతేననీ ఆమె అన్నారు. `నామ్ షబానా`, `మన్మార్జియాన్`, `పింక్`, `బేబీ` చిత్రాలు అందుకు మినహాయింపు కాదని అన్నారు. అయితే ఈ ఏడాది తాను నటించబోయే `మిషన్ మంగళ్`, `బద్లా`, `సాండ్ కీ ఆంక్` లో తాను పరిగెత్తడం లేదని ఆమె తెలిపారు. దాని గురించి చెబుతూ ఈ ఏడాది తాను సినిమాల్లో పరిగెత్తడం లేదనీ. కానీ నియోన్ రన్ మారథాన్‌లో పాల్గొననున్నట్టు తెలిపారు. తాప్సీ మాట్లాడుతూ “ ఈ ఏడాది నేను నియోన్ రన్ మారథాన్‌లో పాల్గొంటున్నాను. ఫ్లాగ్ ఆఫ్ చేస్తాను. ట్రెడ్‌మిల్ మీద పరిగెత్తేటప్పుడు మనం ఇష్టం వచ్చినప్పుడు ఆపేయవచ్చు. కానీ మారథాన్‌లో అలా కాదు. ఇది కష్టమైన పనే. నాకు తెలిసినంతవరకు చాలా మంది రాత్రుల్లోనే పరుగులు తీస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే ఉదయాన్నే సమయం ఉండదనే కంప్లయింట్ చేయడానికి వీలుంటుంది“ అని అన్నారు తాప్సీ.
For More Click Here
More Latest Interesting news