Tarak will scold Akhil
అక్కినేని అఖిల్‌కు, తారక్ మధ్య మంచి అనుబంధం ఉంది. మరి తారక్.. అఖిల్‌ను ఎందుకు తిట్టేవాడో తెలుసా!. సాధారణంగా తారక్‌ను అన్నయ్య అని పిలిచే అఖిల్ ఎప్పుడైనా ఎన్టీఆర్‌ను తారక్‌గారు.. అని అంటే.. `ఏంట్రా బలిసిందా? ఫార్మల్‌గా మాట్లాడుతున్నావ్.. మామూలుగా ఉండు` అని తారక్ అఖిల్‌తో అనేవాడు. అంటే ఇక్కడ ప్రేమతో కూడిన తిట్లను ఎన్టీఆర్ తిట్టేవాడని అర్థమవుతుందిగా. అలాగే తారక్ ఫంక్షన్‌కి వస్తున్నాడని తెలిసిన అఖిల్ తనకు థాంక్స్ మెసేజ్, పెడితే `ఫార్మల్‌గా ఉండొద్దు ఫంక్షన్‌కి రావడం నా బాధ్యత` అంటూ ఫోన్ చేసి అఖిల్‌తో తారక్ మాట్లాడాడని అఖిల్ వేదికపై చెప్పాడు.