స్మగ్లర్లు కోసం టాస్క్ ఫోర్స్ దాడులు

స్మగ్లర్లు కోసం టాస్క్ ఫోర్స్ దాడులు మూడు సంఘటనల్లో 127 ఎర్రచందనం దుంగలు స్వాధీనం ఆరుగురు స్మగ్లర్లు అరెస్ట్ రెండు కార్లు, మూడు మోటారు సైకిళ్ళు స్వాధీనం టాస్క్ ఫోర్స్ నిర్వహించిన దాడుల్లో మూడు ప్రాంతాల్లో 127 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు స్మగ్లర్లును అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు గురువారం విలేకరులతో మాట్లాడుతూ మూడు టీమ్ లు భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డీఎస్పీ మురళీధర్ పర్యవేక్షణలో ఆర్ఐలు ఆలీబాష, సురేష్ కుమార్ రెడ్డి టీమ్ లు 2811 కిలోలు ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారని తెలిపారు. చిత్తూరు జిల్లా సత్యవేడు సమీపంలో మామిడి తోట వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని తమిళనాడు గుమ్మిడిపూడికి చెందిన కరిముల్లా (55),ఏ సయ్యద్ (36) అరెస్ట్ చేశారు. వారిని విచారించి దాచి ఉంచిన 54 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు.రెండో సంఘటన లో చిత్తూరు తూర్పు డివిజన్ లో నెలవాయి గ్రామం వద్ద కరణి మిట్ట గ్రామానికి చెందిన నానిమేల రవికుమార్ (25),నానిమేల చిరంజీవి (22) లను అరెస్టు చేసి 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article