Taxiwala director to join hands with Nani
నేచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని. వైవిధ్యమైన కథలు చేస్తాడు అనే పేరున్నా.. కొన్నాళ్లుగా ఆ వైవిధ్యం కూడా రొటీన్ అయిపోవడంతో వరుసగా(జెర్సీ మినహా) ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పుడు తన మెంటార్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘వి’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో నానిది నెగెటివ్ రోల్. సుధీర్ బాబు హీరో. నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏప్రిల్ లో ఉగాది సందర్భంగా విడుదల కాబోతోందీ చిత్రం. మొత్తంగా ఈ మూవీ తర్వాత నాని ఏ సినిమా చేస్తాడా.. ఎవరితో చేస్తాడా అనే చర్చలపై కొన్నాళ్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ గా అందులో నుంచి ఒకటి కన్ఫార్మ్ అయింది.
కొన్నాళ్ల క్రితం విజయ్ దేవరకొండకు ఇంత ఇమేజ్ లేని టైమ్ లో అతనితో ‘టాక్సీవాలా’ అనే హారర్ థ్రిల్లర్ చేసిన దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తో నాని కొత్త సినిమా చేయబోతున్నాడు. పరిమిత బడ్జెట్ లో కూడా టాక్సీవాలాతో ఆకట్టుకున్నాడీ దర్శకుడు. గీత గోవిందం తర్వాత విడుదల కావడం వల్ల టాక్సీవాలా కమర్షియల్ గా కూడా బానే వర్కవుట్ అయింది. ఇప్పుడా దర్శకుడితోనే నాని సినిమా చేయబోతున్నాడు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రం నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందుతుండటం విశేషం. ఇక సితార బ్యానర్ లో సినిమా అంటే ఆ దర్శకులు ద్వితీయ విఘ్నం కూడా దాటేస్తారు అనే టాక్ ఉంది. అందువల్ల ఇది దర్శకుడికి కూడా ప్లస్ అయ్యే సెంటిమెంటే. ఇక ఈ యేడాది జూన్ లో ప్రారంభం కాబోతోన్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయంటున్నారు. త్వరలోనే హీరోయిన్ తో పాటు ఇతర కాస్ట్ అండ్ క్రాఫ్ట్ మెంబర్స్ ను అనౌన్స్ చేస్తార్ట.