రాజధానిలో టీడీపీ రూ. 40 వేల కోట్ల భూకుంభకోణం

102
TDP 40K CRORES SCAM
TDP 40K CRORES SCAM

TDP 40K CRORES LAND SCAM

రాజధాని విషయంలో మూడు రాజధానుల ఏర్పాటుకు కీలక నిర్ణయం తీసుకుని ఏపీ అసెంబ్లీలో ఆ బిల్లులను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. ఈ నేపధ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వాడీ వేడి చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ నేతలు రాజధానిలో 40 వేల కోట్ల రూపాయల భూ కుంభకోణం చేశారంటూ ఏపీ అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లంక దినకరణ్, పయ్యావుల, కంభంపాటి రామ్మోహనరావులకు  కూడా రాజధాని అమరావతిలో భూములున్నాయని చెప్పారు. విక్రమసింహ పేరుమీద పయ్యావుల భూమి కొనుగోలు చేశారని వివరించారు. వేమూరి రవికుమార్ కుటుంబ సభ్యుల పేర్లపై పెద్ద ఎత్తున భూములున్నాయన్నారు. మాజీ మంత్రివర్యులు పరిటాల సునీత కుమారుడి పేరు మీద కూడా భూములున్నాయని తెలిపారు. రాజధాని ప్రకటనకు ముందే ఈ భూములు కొన్నారని.. అసలు రాజధాని ప్రకటనకు ముందే ఆ ప్రాంతంలో వీరంతా భూములు ఎలా కొన్నారని ప్రశించారు. అందరికీ అక్కడ రాజధాని వస్తుందని ముందే ఎలా తెలుసని ప్రశ్నించారు. అందుకే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మొత్తం 40 వేల కోట్ల రూపాయల భూ కుంభకోణం చేశారని మంత్రి బుగ్గన అసెంబ్లీలో చెప్పారు.

బుగ్గన చేసిన ఈ ఆరోపణలపై ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం ఒక్కసారి షాక్ కు గురైంది. దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం.

tags: ap capital, three capitals, cabinet meet, ap assembly session, capital amaravati, land scam, tdp leaders, minister buggana rajendranath

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here