చంద్రబాబు ఇంటిపై డ్రోన్ల నిరసిస్తూ ప్రైవేటు కేసు?

TDP FILE CASE ON DRONES ISSUE

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి నివాసంపై డ్రోన్‌ ఎగురవేయడాన్నినిరసిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు టీడీపీ నాయకులు . అనంతరం, మీడియాతో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, గవర్నర్ చాలా పాజిటివ్ గా స్పందించారని, ఈ విషయాలన్నింటినీ ఒక మెమొరాండం రూపంలో ఆయనకు అందజేశామని, అధికారులతో మాట్లాడి చర్యలు చేపడతామని చెప్పారని అన్నారు. అనామకులైనటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో ప్రతిపక్ష నాయకుడి ఇంటిపై డ్రోన్లు వీడియోలు తీస్తుంటే దీన్ని ప్రతిఘటించిన తమ నాయకులు, కార్యకర్తలపై అన్యాయంగా ఏడు కేసులు పెట్టారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. తాము కూడా ప్రైవేట్ కేసులు వేయబోతున్నామని, ఈ కేసుల్లో ముఖ్యమంత్రి పేరును కూడా చేర్చబోతున్నామని పేర్కొన్నారు. కృష్ణా నది వరదల నేపథ్యంలో మాజీ సీఎం చంద్రబాబు నివాసంపై డ్రోన్ ఎగరేసిన ఘటనను టీడీపీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటికే ఈ విషయమై గుంటూరు ఐజీకి ఫిర్యాదు చేసిన టీడీపీ తాజాగా గవర్నర్ బిశ్వభూషణ్ ను కూడా కలిశారు. టీడీపీ అగ్రనేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని తదితరులు ఈ మధ్యాహ్నం గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు.దీనిపై అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, చంద్రబాబు నివాసంపై డ్రోన్ ఎగరేసిన ఘటనపై ప్రయివేట్ కేసు దాఖలు చేయాలని నిర్ణయించామని, ఇందులో జగన్ పేరు కూడా చేరుస్తున్నామని వెల్లడించారు. డ్రోన్ తో పట్టుబడిన వ్యక్తి జగన్ నివాసంలో ఉండే కిరణ్ అనే వ్యక్తి పేరు చెప్పాడని, దీని ఆధారంగానే కేసు దాఖలు చేస్తున్నామని అచ్చెన్న వివరించారు.

RK VS Lokesh

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *