ఏపీ లోకల్ వార్ .. సుప్రీంకోర్టుకెళ్ళిన టీడీపీ

Tdp Files Petition in SC for 34 per cent BC quota
ఏపీ స్ధానిక సంస్ధలలో  బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ  ఏపీ సర్కార్  తీసుకున్న నిర్ణయాన్ని విపక్ష టీడీపీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. 50 శాతం కోటా దాటరాదన్న సాకుతో బీసీ రిజర్వేషన్లలో కోత పెట్టడం చెల్లదని టీడీపీ పిటిషన్ లో పేర్కొంది.ఏపీ స్ధానిక సంస్ధల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ వైసీపీ సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మొత్తం రిజర్వేషన్ల శాతాన్ని 50 నుంచి 59.85 శాతానికి పెంచిన వైసీపీ సర్కారు.. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ కోటా తగ్గింపులో ప్రధానంగా బీసీలే నష్టపోవాల్సి వచ్చిందని టీడీపీ ఇప్పుడు వాదిస్తుంది. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 9.85 శాతం మేర తగ్గిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్ష టీడీపీ ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. టీడీపీ తరఫున శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ ఎంపీలు నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఈ పిటిషన్ వేశారు. ఏపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై తీసుకున్న నిర్ణయం చెల్లదని టీడీపీ నేతలు తమ పిటిషన్ లో పేర్కొన్నారు.

రాజ్యాంగపరంగా ఎస్సీ, ఎస్టీ కోటాను తగ్గించే అవకాశం లేకపోవడంతో అనివార్యంగా 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 9.85 శాతం తగ్గిస్తూ ప్రభుత్వం నిన్న జీవో ఇచ్చింది. అయితే బీసీల అండతో ఇన్నాళ్లూ రాజకీయాలు చేసి గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో వారి మద్దతు కోల్పోయిన టీడీపీ మరోసారి వారిని అకట్టుకునేందుకు ఈ అవకాశాన్ని  వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగా బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పోరుకు సిద్ధమైంది. ఇవాళ టీడీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై త్వరలో సుప్రీం విచారణ చేపట్టనుంది.

Tdp Files Petition in SC for 34 per cent BC quota,AP Local Body Elections, AP TDP, AP YSRCP, YSRCP, AP Govt, CM Jagan, jagan mohan reddy

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article