జ‌గ‌న్ కి నేరాలు చేయ‌డం అల‌వాటే!

83
AP CM YS Jagan Bail Petition
AP CM YS Jagan Bail Petition

ఏపీలో ఏక పక్షంగా స్థానిక ఎన్నికలు జ‌రిగాయ‌ని ఆరోపించారు. తాము ఆ ఎన్నికలని బాయ్కాట్ చేసామన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని.. దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదన్నారు. వైసిపి పార్టీ వాళ్లకి నేరాలు-ఘోరాలు చేయడం అలవాటని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు ఏమి చేయలేరు చరిత్రహీనులుగా మిగిలిపోతారని దుయ్య‌బ‌ట్టారు. తాను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయడం రికార్డు అని తెలిపారు. ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అంటే తెలంగాణలో కూడా దారుణంగా ఉన్నాయని విమ‌ర్శించారు. ఎప్పుడు ఎబిసిడి వర్గీకరణ కోసం పని చేసుకుంటూ వచ్చానని.. ఏపీలో ఒకసారి ఓటేసారు రెండోసారి ఓటు వేయకూడదు అనుకుంటున్నారని చెప్పారు. జగన్కు నేరాలు-ఘోరాలు చేయడం అలవాటని విమ‌ర్శించారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు నేరాలు చేయలేదన్నారు. తాను రౌడీయిజం చేయాలనుకుంటే జగన్ బయటకు వచ్చేవాడు కాదన్నారు.

  • ఏపీలో టీడీపీ ఎవరు ఏం చేయలేరని తెలిపారు. జగన్ పెట్టివన్నీ తాత్కాలిక ఇబ్బందులేన‌ని గుర్తు చేశారు. ప్రభుత్వాలు ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం దారుణంగా ఉందన్నారు. త‌న‌లాంటి వాడు మీటింగ్ పెట్టుకునే పరిస్థితి కూడా తెలంగాణలో లేదని విచారం వ్య‌క్తం చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నా మీదనే తప్పుడు కేసులు బనాయించారని చెప్పారు. మందకృష్ణ మాదిగ కాలికి గాయం కావడం దురదృష్టకరమ‌న్నారు. ఇప్పుడు బాగానే ఉన్నారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here