ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ అరెస్ట్

TDP leader Kuna Ravi Kumar arrested

ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి ఇన్‌ఛార్జ్‌ ఈఓపీఆర్‌డీ పరుష పదజాలంతో దూషించిన ఘటన ఏపీలో కలకం రేపింది. ప్రభుత్వ అధికారిని నోటికొచ్చినట్టు తిట్టిన ఆయన ఆడియో లీక్ కావటంతో  కూన రవి కుమార్ ను పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగిని అసభ్య పదజాలంతో దూషించిన ఆయనపై  353, 306, రెడ్‌ విత్‌ 109 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కూనతో పాటు మాజీ ఎంపీటీసీ బొంగు వెంకటరత్నంపై కూడా ఆమదాలవలస పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. మరికాసేపట్లో వారిని ఆమదాలవలస కోర్టులో హాజరు పరచనున్నారు.

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి ఇన్‌ఛార్జ్‌ ఈఓపీఆర్‌డీ గూపపు అప్పలనాయుడును ఫోన్‌ చేసి బూతులు తిట్టిన వైనం ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.గతంలో సరుబుజ్జిలి ఎంపీడీఓ ఎ.దామోదరరావు, అప్పటి ఈఓపీఆర్‌డీ పీవీ మురళిమోహన్‌పై దూషణలకు దిగారు. ఆఫీసులోనే తులుపులు వేసి మరీ  చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తా’ అంటూ సరుబుజ్జిలి ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శిని మాజీ విప్‌ కూన రవికుమార్‌ బెదిరించారు. ఇక తాజాగా మరోమారు ఆయన అసభ్యపదజాలంతో ప్రభుత్వాధికారిని దూషించటంతో కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article