టీడీపీ నేతలు కల్లు తాగిన కోతులు

71
TDP leaders Are Behaving Like Drunken Monkeys
TDP leaders Are Behaving Like Drunken Monkeys

TDP leaders Are Behaving Like Drunken Monkeys
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రవ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలకు అధికారం పోయాక పిచ్చెక్కి మాట్లాడుతున్నారని రోజా మండిపడ్డారు. మద్యం విషయంలో టీడీపీ విమర్శలపై ఘాటుగా స్పందించిన ఆమె  చంద్రబాబు తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.   బోండా ఉమ.. లిక్కర్ షాపులో వర్కరులా మాట్లాడుతున్నారంటూ రోజా విమర్శలు చేశారు .  చంద్రబాబు హయాంలో ఒక బెల్ట్ షాపైనా తగ్గించారా..? అని ప్రశ్నించిన రోజా.. వైఎస్ జగన్ సీఎం అయ్యాక 20 శాతం షాపులను తగ్గించారని గుర్తు చేశారు. ఇక, టీడీపీ కార్యాలయాన్ని లోకేష్ లిక్కర్ షాపులా మార్చేశారనిమహిళల తాళి బొట్లు తెగేలా చంద్రబాబు మద్యం షాపులు పెంచారనినారావారు మద్యాన్ని ఏరులై పారించారని మండిపడ్డారు.కల్లు తాగిన కోతిలా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించిన రోజా.. తమకు నచ్చిన బ్రాండ్స్ లేవని టీడీపీ నేతలు మాట్లాడడం సిగ్గు చేటు అంటూ ఫైర్ అయ్యారు.

వాలంటీర్లపై విమర్శలపై స్పందించిన రోజా వాలంటీర్ వ్యవస్థకు సెల్యూట్ చేస్తున్నా అని పేర్కొన్నారు. ఒక రోజులోనే దాదాపు 60 లక్షల పింఛన్లు పంపిణీ చేశారని వెల్లడించారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని  రోజా హెచ్చరించారు. మద్యం ధరలు పెరిగితే నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినట్లు టీడీపీ నేతలు బాధపడుతున్నారని సెటైర్లు వేసిన రోజా ప్రజలు కోసం పని చేస్తున్న సీఎంపై టీడీపీ నేతలు విమర్శలు చేయడం దారుణమని మండిపడ్డారు. మహిళ ఎమ్మెల్యేతో శాసన సభలో మద్యం బ్రాండ్స్ గురించి చంద్రబాబు మాట్లాడించారు అంటూ ఎద్దేవా చేశారు.

TDP leaders Are Behaving Like Drunken Monkeys,tdp leaders , chandrababu, nara lokesh , rk roja , nagari mla , liquor shops , belt shops, ycp government , jagan

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here