చిరంజీవి ఏపీకి ఏం చేశారో చెప్పిన ఎమ్మెల్యే

119
YCP Tries To Close Entire TDP
YCP Tries To Close Entire TDP

TDP Leaders Questioned JAGAN FOR DEMOLITION

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నదీ పరివాహక ప్రాంతాల లో నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలని ఇటీవల జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ తెలుగుదేశం పార్టీ నేత ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చిరంజీవి పేరును ప్రస్తావిస్తూ, కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడుదల చేసిన వేల కోట్ల నిధుల గురించి కూడా వివరణ ఇచ్చారు .

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నదీ పరివాహక ప్రాంతాల్లో ఎన్నో ప్రభుత్వ భవనాలతోపాటు, వందల ఏళ్లుగా ఉన్న ప్రైవేటు కట్టడాలు సైతం ఉన్నాయని, ముఖ్యమంత్రి జగన్ వీటిని కూల్చివేస్తామని చేస్తున్న ప్రకటనల వల్ల ప్రజలలో ఆందోళన నెలకొందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. లోటు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రంలో ప్రజా ధనం తో కట్టిన ప్రభుత్వ భవనాలను కూల్చడం ఏంటి అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనే గోదావరి నదికి కేవలం 5 మీటర్ల దూరంలో దిండి రిసార్ట్స్ కట్టడానికి అనుమతిని ఇచ్చారని ఎమ్మెల్యే ప్రభుత్వానికి గుర్తు చేశారు. కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాలలో అనేక ప్రైవేటు భవనాలు, హోటల్స్ కట్టడానికి రాజశేఖర్రెడ్డి హయాంలో అనుమతులు ఇచ్చారని, ఆ హోటళ్ల పేర్లతో సహా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గుర్తు చేశారు.

ఇక అదేవిధంగా చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం కోసం వెయ్యి కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారని, దీంతో మెగా టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయడానికి ఆయన కృషి చేశారని, ఆ నిధులతోనే కోవూరు, కోటిపల్లి లాంటి చోట్ల అనేక ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయని, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గుర్తు చేశారు. జగన్ నది పరివాహక ప్రాంతాల్లోని కట్టడాలన్నీ కూల్చివేయాలని అంటే ఇలా వేలకోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటైన ప్రాజెక్టులను కూడా కూల్చివేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి రాష్ట్రానికి ఏం చేశారు అని పదేపదే ప్రశ్నించే రాజకీయ పార్టీలకు చిరంజీవి కేంద్ర మంత్రిగా ఏపీలో టూరిజం అభివృద్ధి కోసం చాలా చేశారని టీడీపీ ఎమ్మెల్యే ప్రస్తావించటం గమనార్హం .

Political news updates

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here