టీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వర్ రావు

55
TDP MLA Macha Nageshwarao
No TDP in Telangana State Now

TDP MLA Macha Nageshwarao

టీడీపీ ఏకైక ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వ‌ర‌రావు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు‌. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో భేటి అయ్యార‌ని స‌మాచారం. టీడీపీ శాస‌న‌స‌భాప‌క్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డికి లేఖ రాశారు‌. లేఖ‌ను స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య‌తో క‌లిసి స్పీక‌ర్‌కు మెచ్చ నాగేశ్వ‌ర‌రావు అందించారు. శాస‌న స‌భ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు. మ‌రికాసేప‌ట్లో టీడీఎల్పీ విలీనంపై అధికారిక బులిటెన్ జారీ చేయ‌నున్న శాస‌న‌స‌భ కార్య‌ద‌ర్శి న‌ర్సింహాచారి. అయితే, రానున్న ఖ‌మ్మం కార్పొరేష‌న్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో టీడీపీకి గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింద‌నే చెప్పాలి.

#khammam municipal elections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here