TDP MLC Dokka Manikya Varaprasad Resigns
టీడీపీ పార్టీకి మరో షాక్ తగలింది. ఇప్పటికే పార్టీకి ఉన్న బలం రోజురోజుకి తగ్గుతుంది. రాజ్యసభ సభ్యులు సైతం పార్టీ వీడారు. ఇక ఉన్న ఎమ్మెల్యేలు ఉంటారో ఉండతారో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి గట్టి షాకిచ్చాడు. ఆ పార్టీ సీనియర్ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను టీడీపీ పార్టీ అథ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి పంపారు. అదేవిధంగా ఆయన రాజీనామా లేఖను మీడియాకు కూడా అందించారు. దీంతో టీడీపీ నేతలు ఒక్కసారిగా ఖంగు తిన్నారు. ఇక డొక్కా అందుబాటులోకి కూడా రావట్లేదట.