వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత

TDP MLC Pothula Sunitha to join YSRCP

శాసనమండలిలో అధికార వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా చంద్రబాబుకు షాకిచ్చి వైసీపీ పక్షాన ఓటేసింది టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత. ఇక ఆమె తాజాగా  వైసీపీ గూటికి చేరారు. సీఎం జగన్‌ సమక్షంలో పోతుల సునీత వైసీపీలో చేరారు. సునీతకు సీఎం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శాసనమండలిలో సునీత ప్రభుత్వానికి మద్దతు నిలిచారు.సీఎం జగన్మోహనరెడ్డి నిర్ణయాలు బాగున్నాయని కితాబిచ్చిన ఆమె  సంక్షేమ పథకాలు, అభివృద్ధికి సంబంధించి సముచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని అందుకే వైసీపీలో చేరానని పేర్కొన్నారు. మూడు రాజధానులు ఏర్పాటును స్వాగతిస్తున్నానన్నారు. అందుకే అనుకూలంగా ఓటు వేశానని ఎమ్మెల్సీ పోతుల సునీత చెప్పారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు సీఎం జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ఉపయోగపడతాయని చెప్పిన సునీత వైసీపీ సర్కార్ వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

 TDP MLC Pothula Sunitha to join YSRCP,potula suneetha , tdp mlc, ycp , join, ap council, jagan mohan reddy, chandrababu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *