టీడీపీ పెయిడ్ అండ్ పెప్పర్ బ్యాచ్..

148
TDP Paid And Pepper Batch : MP Vijayasai Reddy
TDP Paid And Pepper Batch : MP Vijayasai Reddy

TDP Paid And Pepper Batch : MP Vijayasai Reddy

ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఏ చిన్న అవకాశం దొరికినా తెలుగుదేశం పార్టీ శ్రేణులు జగన్ ను వదలకుండా ఏకి పారేస్తూ ఉన్నారు . ఇక ఏపీలోనే కాదు దేశంలోనే హాట్ టాపిక్ గా మారిన  జగన్ తీసుకున్న రాజధాని తరలింపు అంశంపై ఏపీలో ఇంకా రచ్చ కొనసాగుతుంది. అయితే చంద్రబాబు మ‌రియు టీడీపీ మాత్రం రాజధానిని తరలించడానికి వీలు లేదని పట్టు పట్టి కూర్చున్నారు. ఇక తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై రాజ్య‌స‌భ స‌భ్యుడు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అమరావతి భూముల కోసం చంద్రబాబు అత్యంత నీచమైన చేష్టలకు తెగబడుతున్నారంటూ ఓ ట్వీట్ చేశారు. చంద్రబాబు పెయిడ్ బ్యాచ్ మాత్రమే రాజధాని ముసుగులో పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. రాజధాని తరలించొద్దని పిలుపునిస్తే రాష్ట్ర మంతా అల్లకల్లోలమవుతుందని ఆయన అతిగా ఊహించుకున్నారని, ఎవరూ పట్టించుకోకపోవడంతో కారం చల్లే ‘పెప్పర్ గ్యాంగ్’ ను వీధుల్లోకి వదిలారని, వీళ్లంతా టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులే అని ధ్వజమెత్తారు. మరి విజయసాయి రెడ్డి చెప్పిన ఆ పెప్పర్ బ్యాచ్ ఎవరిని ఉద్దేశించి అన్నారో దీనిపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

TDP Paid And Pepper Batch : MP Vijayasai Reddy,tdp, ycp,#paidganags ,#pepparbatch, capital amaravati, amaravati protest, rajyasabha member, vijayasai reddy

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here