ఎయిర్ పోర్ట్ ఘటనపై టీడీపీ హైకోర్టులో పిటీషన్

107
TDP Petition in High Court against vishaka airport incident
TDP Petition in High Court against vishaka airport incident

TDP Petition in High Court against vishaka airport incident

విశాఖ ఎయిర్‌పోర్టులో  చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై తెలుగుదేశం పార్టీ న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. విశాఖలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడమే కాకుండా టమాట, కోడిగుడ్లతో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ప్రజా చైతన్యయాత్రలో భాగంగా గురువారం విశాఖ చేరుకున్న చంద్రబాబును వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రకు ముందస్తు అనుమతి తీసుకున్నా వైసీపీ కార్యకర్తల్ని నిలువరించడంలో పోలీసుల వైఫల్యం చెందారు. పోలీసులు వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరించి ఘటనకు కారణం అయ్యారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇక టీడీపీ, వైసీపీ నేతల బాహాబాహీతో  రోజంతా విశాఖ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలపై హైకోర్టులో టీడీపీ నేడు లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్‌ ఈ పిటిషన్‌‌ను వేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు అనుమతించింది. నేటి మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ జరగనుంది.

TDP Petition in High Court against vishaka airport incident,tdp, chandrababu, vishakhapatnam ,air port, praja chaitanya yathra , ycp attack, police, lunch motion petition

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here