నూజివీడు:రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేసారు. నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నూజివీడు మండలం మీర్జాపురం గ్రామం నుండి బస్సులో ప్రయాణం చేసి ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకున్ఆరు. రాష్ట్ర ప్రభుత్వం నిత్యవసర వస్తువులు ధరలు పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు బస్సు చార్జీలు కూడా పెంచడం దారుణమన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తూ పేద ప్రజలు మట్టి విరుస్తున్నాడని విమర్శించారు.
టిక్కెట్లు ధరలు పెంచడం వల్ల పేద ప్రజలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే పరిస్థితి కనుమరుగైందని ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలకు జీవనం కష్టమవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచి పేద ప్రజలను మరింత దయనీయ పరిస్థితుల్లోకి నెట్టింది. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు త్వరలోనే స్వస్తి పలకాలి. ఈ కార్యక్రమంలో నూజివీడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజబాబు, పార్టీ నాయకులు యనమదల నాని, గిరిబాబు, సంగీతరావు, బద్రు, గోళ్ళ చిన్ని, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ ఛార్జీల పెంపుపై టీడీపీ నిరసన
