రూల్‌ 71 తో వైసీపీకి షాక్ ఇచ్చిన టీడీపీ

70
TDP shocks YSRCP
TDP shocks YSRCP

TDP shocks YSRCP, invokes rule 71

ఏపీ శాసనమండలిలో  ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. రూల్ 71 కింద తీర్మానం ప్రతిపాదించిన టీడీపీ దీనిపై చర్చకు పట్టుపట్టింది. మండలిలో రూల్ 71 పెట్టే అధికారం లేదని, ప్రభుత్వం ప్రతిపాదించిన  మూడు రాజధానుల బిల్లుపై చర్చకు అనుమతించాలని , ప్రభుత్వ అంశాలకు ప్రాధాన్యం ఉంటుందని మంత్రి బుగ్గన చెప్పారు. ప్రభుత్వం శాసనసభలో ఆమోదం పొందిన మూడు రాజధానులు..సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను మండలిలో ప్రవేశ పెట్టేందుకు సిద్దం అవుతున్న సమయంలో టీడీపీ ట్విస్ట్ ఇచ్చింది. వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ రూల్‌ 71 మోషన్‌ కింద నోటీసు ఇచ్చింది. బిల్లులు ప్రవేశపెట్టే ముందు తామిచ్చిన నోటీసుపై చర్చ జరపాలని మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. ఇదే సమయంలో వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందినందున చర్చ జరగాల్సిందేనని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. రూల్‌ 71 కింద బిల్లును తిరస్కరించే అధికారం మండలికి లేదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మండలి ఛైర్మన్‌ … రూల్ 71 నోటీసుపై చర్చకు అనుమతిచ్చారు. దీంతో..పార్టీ ఎమ్మెల్సీతో ఫ్లోర్ లీడర్ యనమల సమావేశమయ్యారు. కానీ, మంత్రులు మాత్రం మండలి ఛైర్మన్ తీరు పైన మండిపడుతున్నారు. సభలో గందరగోళం నడుమ ఛైర్మన్ సభను వాయిదా వేసారు.

TDP shocks YSRCP, invokes rule 71,ap legeslative council, rule 71, three capitals, ap government , shock to ycp, tdp , yanamala ramakrishnudu 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here