టీడీపీని అధికారంలోకి తీసుకురావాలి

ఏలూరు:నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏలూరు మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. అయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం నుండి ఎన్ని కష్టాలు ఎదురైనా, కేసులు పెట్టిన మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని గెలిపించాలి.జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజలను అభ్యర్థించి అన్ని విధాలుగా రాష్ట్ర ప్రజలను రాష్ట్రాని సైతం ముంచి వేసాడు. తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలోకి వెళ్లిన కొడాలి నాని, వంశీమోహన్ లు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబాన్ని గూర్చి అసభ్యకరంగా వ్యాఖ్యానించడం దారుణమని అయన అన్నారు.
నూజివీడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న విభేదాలను, నాయకుల మధ్య తొలగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫేస్బుక్, వాట్సాప్ లో వ్యాఖ్యలు చేసుకోవడం మానకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసిపి నాయకులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని, నాయకులను టార్గెట్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, మాకు పౌరుషాలు ఉన్నాయి, మేము మాట్లాడగలం, వారి కంటే ఎక్కువ బూతులు తిట్టగలమని అన్నారు. పదవులు శాశ్వతం కాదు, ప్రజలకు సేవ చేయడమే మా కుటుంబ వంశ పారంపర్యంగా వస్తున్న ఆచారం, దాన్ని నిలబెట్టుకునేందుకు ప్రజల కోసమే పని చేస్తాను. 2023 లో కానీ, 2024లో కానీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కీలకం కానున్నాయని, కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రం గురించి చర్చ జరుగుతుందని అన్నారు. తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ఓటు బ్యాంకు అలాగే ఉందని, కారణాల వలన ప్రస్తుతం టిడిపి ఓటమిపాలైనప్పటికీ రానున్న ఎన్నికల్లో గెలుపు తెలుగుదేశం పార్టీదే. సర్పంచులు ఎంపీటీసీల ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గంలో అత్యధికంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారని అన్నారు.
అన్ని సర్వేలు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తోందని చెబుతున్నాయని దానికి తగ్గట్లుగా పార్టీ నాయకులు కార్యకర్తలు విభేదాలు వీడి, అభ్యర్థుల కోసం పనిచేసి గెలిపించాలి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుణ్యమా అంటూ మూడేళ్లలోనే ఎక్కడలేని అభిమానం పెరిగిందని మాగంటి బాబు అన్నారు.
క్రమశిక్షణగల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసమే పని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలంటే, అది మన నూజివీడు నియోజకవర్గం నుండే ముద్దరబోయిన వెంకటేశ్వరరావును శాసనసభ్యులుగా గెలిపించి నాంది పలకాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో నూజివీడు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, నూజివీడు పట్టణ, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లిశెట్టి జగదీష్, ముసునూరు రాజబాబు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెరుకూరు దుర్గాప్రసాద్, రజక వర్గ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article