అనిల్ టార్గెట్ గా టీడీపీ ట్రోలింగ్

TDP TROLL ANIL

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ ను లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ విపరీతంగా ట్రోలింగ్ చేస్తోంది. నోటి పారుదల శాఖ మంత్రి, ఇరిటేషన్ శాఖ మంత్రి, నోటు మంత్రి అంటూ అనిల్ పై మీమ్స్ సృష్టిస్తూ కామెడీ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి గట్టిగా కౌంటర్లు ఇచ్చే విషయంలో అనిల్ ముందుంటున్నారు. ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన రోజా ఎందుకనో తన దూకుడు తగ్గించగా.. అంబటి రాంబాబు మాత్రం అడపాదడపా సెటైర్లతో ప్రతిపక్షంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కానీ మంత్రి అనిల్ రూటే సెపరేటు. జగన్ పేరెత్తితే ప్రతిపక్షాలపై విరుచుకు పడిపోతున్నారు. తమ అధినేతను విమర్శించాలని చూస్తే.. చంద్రబాబునూ వదిలిపెట్టడంలేదు. ఇక మాజీ మంత్రి నారా లోకేశ్ నైతే చెడుగుడు ఆడేస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అనిల్ ను టార్గెట్ చేసుకున్నాయి. ఆయన పొరపాటున మాట్లాడిన మాటలను ఉపయోగించి కామెడీ వీడియోలు రూపొందించి షేర్ చేస్తున్నాయి. గతంలో లోకేశ్ ను వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎలా ట్రోల్ చేశాయో.. ఇప్పుడు అదే తరహాలో అనిల్ ను టీడీపీ శ్రేణులు ట్రోలింగ్ చేస్తున్నాయి. తమ కార్యకర్తలు అనిల్ పై రూపొందిస్తున్న వీడియోలను చూసి లోకేశ్ కూడా ఆనందిస్తున్నారు. వాటిని తాను కూడా షేర్ చేస్తున్నారు.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article