ఇంగ్లీష్ మీడియంపై టీడీపీ వర్సెస్ వైసీపీ

127
#TIRUPATI BYELECTION APRIL 17TH
#TIRUPATI BYELECTION APRIL 17TH
TDP vs YCP on English Medium

ఏపీలో  తీవ్ర దుమారం రేపిన ఇంగ్లీషు మీడియం పాఠశాలల ఏర్పాటు అంశం లోక్ సభలోనూ చర్చకు వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుండి ఆరో తరగతి వరకు పాఠశాలలను ఇంగ్లీషు మీడియం స్కూళ్లుగా మారుస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో తెలుగు అంశాన్ని తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించి కేబినెట్ లో సైతం  ఆమోదించారు. దీని పైన పెద్ద ఎత్తున విమర్శలు వెల్లు వెత్తాయి. విమర్శలు చేసిన వారిపైన ముఖ్యమంత్రి సైతం తీవ్ర స్థాయిలో స్పందించారు. అదే సందర్భంలో పవన్ పైన జగన్ వ్యక్తిగత ఆరోపణలు చేసారంటూ జనసేన.. టీడీపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేసాయి. అయితే, ముఖ్యమంత్రి మాత్రం ఎన్ని విమర్శలు వచ్చినా.. అడ్డంకులు వచ్చినా ఈ నిర్ణయం లో ముందుకే వెళ్తామని తేల్చి చెప్పారు. ఇక, ఇప్పుడు ఇదే అంశం పైన లోక్ సభలో టీడీపీ.. వైసీపీ సభ్యులు తమ వాదనలు వినిపించగా..కేంద్ మంత్రి తమ విధానం స్పష్టం చేసారు. సభలో టీడీపీ ఎంపీ కేశినేని నానీ, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం  రాజు మధ్య వాడీ వేడి వాగ్యుద్ధం నడిచింది. ఆ తర్వాత కేంద్రమంత్రి పోఖ్రియాల్ తెలుగు భాష పరిరక్షణకు సంబంధించిన పలు విషయాలపై వివరణ ఇచ్చారు. మైసూరులోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (సీఐఐఎల్) అధీనంలో ఉన్న తెలుగు క్లాసికల్ అభివృద్ధి సంస్థను నెల్లూరుకు మార్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాంతీయ భాషలను పటిష్ఠం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని, ఇందుకోసం మైసూరులోని సంస్థను నెల్లూరుకు మార్చారు పోఖ్రియాల్ తెలిపారు. ఈ సంస్థ నవంబరు 13 నుంచి పనిచేయడం ప్రారంభించిందని వివరించారు. తెలుగు భాషపై ఇందులో చర్చలు, నిర్ణయాలు ఉంటాయని, అలాగే, సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నారని సభకు వివరించారు.

tags : andhrapradesh, cm jagan, ys jagan mohan reddy, english medium schools, telugu language, telugu medium schools, tdp mp keshineni nani, ycp, raghurama krishnam raju,union minister, pokhriyal

https://tsnews.tv/ex-minister-ganta-srinivas-rao-properties-auction/

శివసేనను ప్రశ్నించిన ఎంపీ నవనీత్ కౌర్

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here