Team india problems – కష్టాల్లో టీమిండియా..
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న చివరి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కివీస్ బౌలర్లుహెన్రీ, బౌల్ట్‌లు చెలరేగిపోవడంతో రోహిత్‌సేన 18 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. స్వల్ప స్కోర్లకే భారత ఓపెనర్లు రోహిత్ శర్మ(2), శిఖర్ ధావన్ (6), ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్(7) లు పెవిలియన్ చేరగా.. ఆ వెంటనే ధోని(1) సైతం క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తొలుత రోహిత్ శర్మను హెన్రీ క్లీన్ బౌల్డ్ చేయగా.. ధావన్‌ను బోల్ట్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే శుభ్‌మన్ గిల్‌ను హెన్రీ ఔట్ చేయగా.. ధోనిని బౌల్ట్.. బౌల్డ్ చేశాడు. నాలుగో వన్డేలో బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో రోహిత్ సేన ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు వన్డేలు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. చివరి వన్డేలో గెలిచి సిరీస్ ను విజయవంతంగా ముగించాలని అనుకుంటోంది. కానీ అది సాధ్యం అయ్యేలా కనిపించటం లేదు. ప్రస్తుతం టీమిండియా కష్టాల్లో ఉంది.