నల్లటి బ్యాండ్లతో బరిలోకి టీమిండియా ఆటగాళ్లు

సిడ్నీ: ద్రోణాచార్య పురస్కార గ్రహీత, ప్రముఖ క్రికెట్‌ కోచ్‌ రమాకాంత్‌ అచ్రేకర్‌ మృతికి టీమిండియా ఆటగాళ్లు నివాళులు అర్పించారు. అచ్రేకర్‌ బుధవారం సాయంత్రం ముంబయిలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆయన  కన్నుమూశారు. దీంతో ఆయన మృతికి సంతాపంగా టీమిండియా ఆటగాళ్లు తమ చేతికి నల్ల బ్యాండ్లు ధరించారు. వాటిని ధరించే మైదానంలోకి దిగారు.

సచిన్‌ తెందుల్కర్‌, వినోద్‌ కాంబ్లీ వంటి క్రికెట్ దిగ్గజాలను భారతీయ క్రికెట్‌ జట్టుకు అచ్రేకర్‌ అందించారు. అచ్రేకర్‌ మృతికి సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు నివాళులు అర్పిస్తున్నారు. మరోవైపు ఆసీస్‌ ఆటగాళ్లు సైతం మోచేతులకు నల్ల బ్యాండ్లు ధరించారు. ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ బిల్‌ వాట్సన్‌(87) ఇటీవల కన్నుమూశారు. ఆయన మరణానికి సంతాపంగా పైన్‌ సేన నల్లబ్యాండ్లు కట్టుకుని మైదానంలోకి దిగింది

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article