మరో సవాల్ కు సై

TEAM INDIA READY TO PLAY WITH NEW ZEALAND

  • కివీస్ చేరుకున్న టీమిండియా
  • బుధవారం తొలి వన్డే

ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించి టెస్టు, వన్డే సిరీస్ లను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన టీమిండియా.. మరో సవాల్ కు సన్నద్ధమవుతోంది. రెట్టించిన సమరోత్సాహంతో కివీస్ పర్యటనను ప్రారంభించడానికి ఉవ్విళ్లూరుతోంది. ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు భారత క్రికెట్ జట్టు ఆదివారం న్యూజిలాండ్ లో అడుగు పెట్టింది. టీమిండియా ఆటగాళ్లంతా ఆక్లాండ్‌ నగరానికి చేరుకున్నారు. స్థానికంగా ఉన్న భారత అభిమానులు విమానాశ్రయంలో వారికి ఘన స్వాగతం పలికారు. బుధవారం సేపియర్ లో తొలి వన్డే జరగనున్న నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో అదే గ్రౌండ్ లో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయనున్నారు. ఈ టూర్‌ తర్వాత స్వదేశంలో మరికొన్ని మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా… వరల్డ్‌ కప్‌ ప్రారంభానికి ముందు విదేశీ పిచ్‌లపై మన కుర్రాళ్ల సత్తా చూపించడానికి ఈ పర్యటన ఓ మంచి అవకాశం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆసీస్‌తో పోలిస్తే సొంతగడ్డపై కివీస్‌ అత్యంత బలమైన జట్టు. ఈ నేపథ్యంలో కివీస్ ను వారి గడ్డపై ఓడించాలంటే భారత జట్టు గట్టిగా శ్రమించాల్సిందే. ఇప్పటివరకు న్యూజిలాండ్ లో ఏడు సార్లు ద్వైపాక్షిక సిరీస్ లు జరగ్గా.. భారత్‌ ఒక సిరీస్ లో గెలిచి, నాలుగింటిలో ఓడిపోయింది. మరో 2 సిరీస్ లు సమమయ్యాయి. మొత్తమ్మీద ఇరు జట్ల మధ్య 34 వన్డేలు జరగ్గా… భారత్‌ 10 గెలిచి 21 ఓడిపోయింది. 1 మ్యాచ్‌ ‘టై’ కాగా, మరో 2 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు.  కాగా, బుధవారం భారత్, కివీస్‌ జట్ల మధ్య తొలి వన్డే నేపియర్‌లో జరగనుండగా… మరుసటి రోజు గురువారం ఇదే వేదికపై భారత మహిళల, కివీస్‌ మహిళల మధ్య కూడా సిరీస్‌లో తొలి వన్డే జరగనుండటం విశేషం.

SPORTS UPDATES

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article