సామాజిక కోణంలో తెలంగాణ కేబినెట్?

Telangan Cabinate for common man

  • అన్ని వర్గాలకూ అవకాశం
  • ఈనెల మూడో వారంలో విస్తరణ

తెలంగాణ కేబినెట్ ను సామాజిక కోణంలో ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. మహిళలు సహా అన్ని వర్గాలకూ ప్రాధాన్యత ఉండేలా మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం అదేపనిలో తలమునకలై ఉన్న ఆయన.. ఈనెల మూడోవారంలోనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనే అంశంపై గులాబీ దళపతి ఓ స్పష్టతకు వచ్చినట్టు సమాచారం. గత ప్రభుత్వంలో ఒక్క మహిళకూ మంత్రిగా అవకాశం ఇవ్వకపోవడంతో పలు విమర్శలు ఎదుర్కొన్న కేసీఆర్.. ఈసారి తన కేబినెట్ లో ఓ మహిళకూ అవకాశం కల్పించనున్నారని అంటున్నారు. వాస్తవానికి కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు నెలరోజులు కావస్తున్నా.. మంత్రివర్గం ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం మంచి రోజులు లేకపోవడంతో ఈనెల మూడో వారంలో ఇందుకు ముహూర్తంగా నిర్ణయించినట్టు చెబుతున్నారు. తెలంగాణలో 18 మందిని మంత్రివర్గంలో తీసుకోవచ్చు. అయితే, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహమూద్ అలీని మాత్రమే మంత్రిగా తీసుకుని, ఆయనకు హోంశాఖ కేటాయంచారు. తాజా విస్తరణలో ఎనిమిది మందికి అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది. మిగిలిన ఖాళీలను లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత భర్తీ చేస్తారని అంటున్నారు. ప్రస్తుతం తీసుకోబోయే 8 మందిలో ఒక స్థానం మహిళకు, ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. మిగిలిన ఐదు బెర్తుల్లో రెండు బీసీలకు ఇచ్చి.. మూడింటిని ఓసీలకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ఆశావహులంతా మంత్రివర్గ విస్తరణ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కొంతమంతి కేటీఆర్ ద్వారా తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article