ఆజాది కా అమృత్ ఉత్సవాలు

Telangana Aajadi ka Amrut

తెలంగాణలో సుమారు 75 వారాల పాటు ఆజాది కా అమృత్ ఉత్సవాల్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు రమణాచారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. రాజకీయాలకు అతీతంగా గ్రామస్థాయి నుంచి సీఎం వరకు ప్రతిఒక్క ప్రజాప్రతినిధులు కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. జాతి స్వేచ్ఛను స్వాతంత్య్రాన్ని మరువకూడదన్నారు. ఉప్పుసత్యాగ్రహ పోరాటం వల్ల మ్యాన్ ఆఫ్ థి ఇయర్ ఆఫ్ థి వరల్డ్ గా గుర్తింపు తెచ్చిందన్నారు. బ్రిటిష్ వాళ్ళు స్వతంత్ర పోరాట యోధులను కొడుతుంటే కనీసం చేతులు సైతం అడ్డం పెట్టలేదని గుర్తు చేశారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ గాలిలోకి గాలి బెలూన్స్ వదిలారు.

* 1930 మార్చ్ 12న గాంధీ ఉప్పుసత్యాగ్రహంను గాంధీ ప్రారంభించారు. 24 రోజులు- 384 కిలోమీటర్లు ఉప్పుసత్యాగ్రహం పోరాటం కొనసాగిందన్నారు. గాంధీ ఉప్పుసత్యాగ్రహం పోరాటంలో గాంధీకి ఏమైనా జరుగుతుందేమో అని చాలామంది ఆందోళన చెందారు. గాంధీ ఉప్పుసత్యాగ్రహం యాత్ర చేయలేడని అవహేళన అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు చేశారు. శాంతియుతంగా పోరాటాలు ఎలా చేయాలో ప్రపంచానికి చేసిన ఘనత గాంధీకి దక్కుతుంది. గాంధీ శాంతియుత పోరాటం వల్లే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. శాంతియుతంగా పోరాటాలు ఎలా చేయాలో ప్రపంచానికి చేసిన ఘనత గాంధీకి దక్కుతుందని సీఎం అన్నారు. గాంధీ మార్గంలోనే తెలంగాణ మనం సాదించుకున్నామని తెలిపారు.

హైదరాబాద్ శుక్రవారం ఉదయం నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో ఆజాది కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో జాతీయ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. పాల్గొన్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ. హాజరైన మంత్రులు, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, ప్రజాప్రతినిధులు పలువురు ప్రముఖులు.

Telangana Latest News

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article