Telangana Administration from Brk Bhavan
బూర్గుల రామకృష్ణారావు భవన్ నుంచి సచివాలయ కార్యకలాపాలు షురూ అయ్యాయి. కార్యాలయాల తరలింపు పూర్తై కార్యదర్శులు ఇక్కడినుంచే తమ కార్యకలాపాలను ప్రారంభించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఈ ఉదయం బీఆర్కే భవన్‌కు వచ్చి తన ఛాంబర్‌ను పరిశీలించి కాసేపు అక్కడే ఉండి కుందన్‌బాగ్‌లోని క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి అదర్ సిన్హా, వైద్య-ఆరోగ్య శాఖా కార్యదర్శి శాంతికుమారి తదితరులు బీఆర్కే భవన్‌లోని తమ ఛాంబర్లకు వచ్చారు. పేషీలు ఇంకా పూర్తి స్థాయిలో తరలింపు పూర్తి కాకపోవడంతో కొంత మంది ఉద్యోగులు సచివాలయం నుంచే పని చేయనున్నారు. తరలింపు ప్రక్రియ ఇంకా కూడా కొనసాగుతోంది. మరోవైపు బీఆర్కే భవన్లో మరమ్మతులు జరుగుతున్నాయి. బీఆర్కే భవన్ వద్ద పోలీసులు ట్రాఫిక్‌ను పరిశీలించి వాహనాల రద్దీ, పార్కింగ్ తదితర విషయాలను గమనించారు.