“ఈటల” సర్వే రిపోర్టులో ఏముంది?

  • అమిత్ షాతో ముగిసిన భేటి
  • కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల, వివేక్ భేటి
  • హాజరైన హుజురాబాద్ ఎన్నికల ఇంచార్జ్ జితేందర్ రెడ్డి

ఢిల్లీ: కేంద్రమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ ముగిసింది. మాజీమంత్రి ఈటల రాజేందర్ పార్టీలో చేరిన రోజే అమిత్‌షాను కలవాలనుకున్నామని వారు తెలిపారు. ఈటల ఎన్నికల్లో గెలుస్తారనే సర్వే రిపోర్ట్స్ వచ్చాయని వారు మీడియాతో వెల్లడించారు. క్విట్ ఇండియా దినోత్సవం రోజు భాగ్యలక్ష్మి గుడి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ సందర్భంగా ప్రకటించారు. బీజేపీ బహిరంగ సభకు అమిత్ షా వస్తామన్నారని తెలిపారు. ఆగస్టు 9న పాదయాత్ర మొదలవుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ భయపడుతోంది, వారికి అభ్యర్థి దొరకడం లేదని సంజయ్‌ ఎద్దేవా చేశారు. కేంద్రమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్ర పరిస్థితులు వివరించామని బీజేపీ నేత ఈటల రాజేందర్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ ముగిసిందని అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాషాయ జెండా ఎగరాలని ఆయన అన్నారని చెప్పారు. ఇందుకోసం ఎన్నిసార్లు అయినా తెలంగాణ వస్తా అన్నారని తెలిపారు. ఎంత డబ్బు ఖర్చు చేసినా గెలిచేది బీజేపేనని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article