తెలంగాణా బడ్జెట్ సమావేశాల ముహూర్తం ఖరారు

Telangana Budget meting

తెలంగాణా బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారయ్యింది. తెలంగాణాలో తెరాస ప్రభుత్వం రెండవసారి అధికారం లోకి వచ్చి చాలా రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. ఇప్పటికే ఈ విషయం మీద విమర్శకులు తీవ్ర స్థాయిలో విరుచుటకు పడుతున్నారు. కాగా, తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఒక వార్త వెలువడింది. ఈ నెల 20 తర్వాతే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. అయితే 18,19,20 తేదీల్లో 15వ ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రంలో పర్యటిస్తుంది. ఆ తర్వాతే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది.
గ్రామీణ సడక్ యోజన, నేషనల్ ఎడ్యుకేషన్ మిషన్, నేషనల్ లైవ్లీ హుడ్ మిషన్ ద్వారా రాష్ట్రానికి ఈసారి కొద్దిగా నిధులు పెరిగాయి. అంతేకాకుండా బడ్జెట్ లో నేషనల్ హైవే అథారిటీకి నిధులు పెంచడంతో ఇందులో తెలంగాణకి కొంత నిధులు వచ్చే అవకాశం ఉంది. ఇంకా దీనికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article