దళిత బంధువా.. దళిత వ్యతిరేకా?

దళిత బందు పేరుతో కేసీఆర్ కి క్షీరాభిషేకం చేయడం ఎంతవరకు సమంజసమ‌ని టీపీసీసీ సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్
మల్లు రవి అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితుడిని చేస్తా అని కేసీఆర్ మాట తప్పార‌ని.. దళిత ముఖ్యమంత్రిని చేయకపోతే తల నరుక్కుంటా ఉన్న వీడియోని ఇప్పటికీ ప్రజలు చూస్తున్నార‌ని తెలిపారు. దళిత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను కొద్దికాలంలోనే తీసేశార‌ని.. అత‌న్ని ఎందుకు తీసేసారో ఇప్పటివరకు చెప్పలేదన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో ఉన్న నిధులను కూడా దారి మళ్లించార‌ని చెప్పారు. దళితులకి 65 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయలేదని కెసిఆర్ ఒప్పుకున్నారని.. కేసీఆర్ నూటికి నూరుపాళ్లూ దళిత వ్యతిరేకి అని విమ‌ర్శించారు.

సీఎం కేసీఆర్ వల్లే దళితులు అభివృద్ధి చెందలేదని దళితులకి 10 లక్షలు ఇవ్వడం మేము వ్యతిరేకం కాద‌న్నారు. దళిత సాధికారత స్కీమ్ను ఓట్ల కోసమే కాకుండా ఒక స్కీముగా అమలు చేయాలన్నారు. దళితులకి 32 వేల ఉద్యోగాలు రాకుండా కేసీఆర్ చేశార‌ని.. ప్రతి దళిత కుటుంబానికి ఇస్తానన్న మూడు ఎకరాల భూమి ఏమైంద‌న్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వని కెసిఆర్ దళిత బంధువా .. దళిత వ్యతిరేకా అని నిల‌దీశారు. 2014, 2018లో కేసీఆర్ని ప్రజలు నమ్మారు ఇక నమ్మర‌ని తేల్చారు. హుజురాబాద్ లో ఓట్ల కోసమే పైలెట్ ప్రాజెక్టుగా దళిత సాధికారతపై స్కీమును పెట్టారన్నారు. నేను అడిగిన వాటికి సమాధానం చెప్పి దళితుల వద్దకు వెళ్ళమ‌ని హితువు ప‌లికారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article