జ‌గ‌న్, కేసీఆర్.. హోం ఐసోలేష‌న్‌?

35

తెలంగాణ స్పీక‌ర్ పోచారం శ్రీనివాసరెడ్డికి క‌రోనా పాజిటివ్ సోక‌డంతో తెలుగు రాష్ట్రాలు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డాయి. ఎందుకంటే, ఆయ‌న మ‌న‌వ‌రాలికి ఇటీవ‌ల శంషాబాద్‌లో వివాహం జ‌రిపించారు. ఆ కార్య‌క్ర‌మానికి ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు హాజ‌రయ్యారు. రెండు ప్ర‌భుత్వాలు ఆ వివాహానికి హాజ‌రు కావ‌డంతో.. స్పీక‌ర్ తో స‌న్నిహితంగా ఉన్న‌వారంతా హోమ్ ఐసోలేష‌న్‌లో ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. రానున్న రోజుల్లో ఇంకెంత మందికి క‌రోనా సోకుతుందోన‌ని ఆందోళ‌న అయితే చాలామందికి నెల‌కొంది. మ‌రి, జ‌గ‌న్‌, కేసీఆర్‌లూ హోం ఐసోలేష‌న్ లో ఉండాల్సిందేనా? అని స‌గ‌టు తెలుగు ప్ర‌జ‌లు అనుకుంటున్నారు.

  • సాధార‌ణ‌ మెడికల్ టెస్ట్ లలో భాగంగా బుధ‌వారం రాత్రి చేయించిన కోవిడ్ టెస్ట్ లో స‌భాప‌తికి పాజిటివ్ నమోదైంది. ప్రస్తుతం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు AIG, గచ్చిబౌలి హాస్పిటల్ లో చేరారు. గత కొన్ని రోజులుగా ఆయ‌న్ని కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల‌ని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here