టీపీసీసీ చీఫ్.. రేవంత్ రెడ్డి

FINALLY CONGRESS PARTY DECIDED TO APPOINT REVANTH REDDY AS TELANGANA CONGRESS PRESIDENT. ANNOUNCEMENT MAY COME VERY SOON. IF CONGRESS ANNOUNCES REVANTH REDDY NAME, DEFINITELY THERE WILL BE A GOOD OPPOSITION IN TELANGANA STATE, WHICH WILL HELP THE PEOPLE FINALLY.

126

* వారంలోగా ఏఐసిసి ప్రకటన

* సీనియర్లను ఒప్పించిన అధిష్టానం

* 2023 లో గెలుపే లక్ష్యంగా సమగ్ర ప్రక్షాళన

* పార్టీపరంగా పటిష్టమైన మీడియా

* పిసిసి ప్రచార విభాగంలో మార్పులు

  • కె అశోక్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ప్రజల్లో బలమున్న నాయకుడిని పార్టీకి సారథిగా నియమించాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్ గా ఆవిర్భవించిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ని పీసీసీ చీఫ్ గా ఎంపిక చేసింది. గత కొంతకాలం నుంచి సుదీర్ఘంగా పీసీసీ చీఫ్ ఎంపికపై పూర్తి స్థాయిలో కసరత్తు నిర్వహించింది. ఇందుకుగాను రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో విచారణ చేసి పిసిసి అభ్యర్థి ఎంపికపై సమగ్రమైన నివేదికను పార్టీ అధిష్టాన వర్గానికి అందించారు. దీనిపై కూడా అధ్యయనం చేసి ఫైర్ బ్రాండ్ గా పేరున్న రేవంత్ రెడ్డి వైపే మొగ్గుచూపి, ఖరారు చేసినట్లు తెలిసింది. మరో వారం రోజుల లోపు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ని ఏఐసీసీ ప్రకటించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రజాకర్షణ గల నాయకుడు అవసరమని అధినాయకత్వం గుర్తించి రేవంత్ రెడ్డిని ఎంపిక చేసినట్లు తెలిసింది.

  • రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మాత్రం సీనియర్లు కొంతమంది వ్యతిరేకించడం వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. ప్రస్తుతం సీనియర్ ల అందర్నీ అధిష్టానం పిలిచి వారికి సర్ది చెప్పినట్లు సమాచారం. పి సి సి రేసులో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఏఐసీసీ లోకి తీసుకుంటామని అధిష్టానం హామీ ఇచ్చి బుజ్జగించినట్లు సమాచారం. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా జాతీయ కమిటీ లోకి తీసుకోవడానికి అంగీకారం కుదిరింది. పటిష్టమైన పీసీసీ కమిటీ రేవంత్ రెడ్డి సారథిగా రాష్ట్ర పార్టీ కార్యవర్గాన్ని రూపొందించారు. ఈ కమిటీలో ప్రధానంగా మధు యాష్కిగౌడ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క, దామోదర రాజనర్సింహ తదితరులకు కీలక పదవులు దక్కే అవకాశం ఉంది. 2023 లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే సర్వశక్తులూ ఒడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కలిసికట్టుగా పని చేస్తామని అధిష్టానం ముందు ప్రామిస్ చేసినట్లు సమాచారం.

పార్టీ పరంగా మీడియా
2023లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి పార్టీపరంగా సొంత మీడియా ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి బలంగా భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక ఎలక్ట్రానిక్ మీడియా “టీవీ ఛానల్”, భారీ స్థాయిలో ఉండే ప్రింట్ మీడియా “దిన పత్రిక’ ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి మీడియా పరంగా ఆశించిన స్థాయిలో ప్రచారం రాకపోవడం వల్ల ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. 60 ఏళ్లుగా పడుతున్న తెలంగాణ గోసను పటాపంచలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని అందించింది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజల మనసుల్లో కి ఎక్కించడం లో పూర్తిగా విఫలమైనందున 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని పార్టీ చవి చూసిందని నాయకులు బలంగా నమ్ముతున్నారు. ఇలాంటి తప్పిదం భవిష్యత్తులో చేయకుండా ఉండడానికి పార్టీపరంగా సొంత మీడియా కీలక పాత్ర వహిస్తుందని నాయకులు అంచనా వేస్తున్నారు.

  • రాష్ట్రంలో గత అనుభవాలను పరిశీలిస్తే “సాక్షి టీవీ, ” “సాక్షి పేపర్” తీసుకొచ్చి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే, టిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ కూడా తెలంగాణ వాణి వినిపించేందుకు “టీ న్యూస్” (టీవీ) “నమస్తే తెలంగాణ” పేపర్ లను సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. వీటి ద్వారా ప్రభుత్వాన్ని సునాయాసంగా ఏర్పాటు చేయగలిగారు. ఇలా, ఆయా పార్టీలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సొంత మీడియా కీలకంగా పనిచేసిందని చెప్పడం అతిశయోక్తి కాదు. వైఎస్ఆర్, కెసిఆర్ బాటలోనే కాంగ్రెస్ పార్టీ కూడా సొంత మీడియాను ఏర్పాటు చేసుకొని ప్రజా బాహుళ్యం లోకి వెళితే సత్ఫలితాలు వస్తాయని నేతలు బలంగా నమ్ముతున్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక టీవీ చానల్, ఓ దినపత్రిక తెలంగాణ రాష్ట్రంలో రానున్నాయి. వివిధ ప్రసార మాధ్యమాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని వార్తా విశేషాలను విస్తృతంగా కవర్ చేయటానికి ప్రస్తుతం గాంధీ భవన్ లో ఉన్న ప్రచార విభాగాన్ని కూడా ప్రక్షాళన చేయనుంది. ఈ విభాగంలో కొత్త శక్తులను ఏర్పాటు చేసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.

విహెచ్ ఎసరు
మొదటినుంచి రేవంత్ రెడ్డి ని వ్యతిరేకిస్తూ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు బహిరంగంగా విమర్శలు చేశారు. అలాగే పార్టీ ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ పై నోరు పారేసుకోవటం వంటి క్రమశిక్షణారాహిత్యం చర్యలకు పాల్పడటం వల్ల వేటు వేసే అవకాశాలు ఉన్నాయి. కాగా, అధికార టీఆర్ఎస్ పార్టీకి కోవర్టుగా పని చేస్తున్నారనే విషయం కూడా అధిష్టానానికి ఫిర్యాదులు అందినట్లు సమాచారం. విహెచ్ వ్యవహారాన్ని అధిష్టానం సమగ్రంగా పరిశీలిస్తోందని, రేవంత్ ను వ్యతిరేకిస్తే మాత్రం కచ్చితంగా పార్టీ నుంచి పంపించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here