తెలంగాణలో రాజ్యాంగ సంక్షోభం?

Telangana Constitutional Crisis?

ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతోంది. 13వ రోజు ఆర్టీసీ కార్మికులు బైక్ ర్యాలీలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సైతం కార్మిక పక్షాన పోరాటం చేస్తున్నారు. ఇక కోర్టు ఇరు వర్గాలను చర్చలకు వెళ్లాలని సూచించిన నేపధ్యంలో  కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని టీఎంయూ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నో త్యాగాలు, ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అలాంటి రాష్ట్రంలో నేనే రాజు.. నేనే మంత్రి అంటే కుదరదన్నారు. తాము చేపట్టిన సమ్మె విషయంలో ప్రభుత్వం ముందుకు రాకపోతే రాజ్యాంగ సంక్షోభం కూడా రావచ్చని వ్యాఖ్యానించారు అశ్వత్థామరెడ్డి. ఇప్పటికైన సీఎం కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలని, అలాగే సీనియర్ మంత్రులు హరీశ్‌రావు, ఈటల మౌనం వీడాలని కోరారు. హైకోర్టు ఆదేశించిన విధంగా తాము సమ్మె విషయంలో చర్చలకు సిద్ధంగా ఉన్నామని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఎలా సాధ్యమో చర్చల్లోనే చెబుతామన్నారు అశ్వత్థామరెడ్డి.
tags :tsrtc, tsrtc strike, rtc strike, telangana government, rtc workers , jac convinor , ashwatthama reddy

తెలంగాణా ఆర్టీసీ ఎండీ  వీరిలో ఎవరో ?

జగన్ కేసీఆర్ తో కలిస్తే నీకు చెడ్డపేరు వస్తుందన్న కోమటిరెడ్డి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *