సీఎస్ కు కరోనా!

TELANGANA CS GOT CORONA

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు కొవిడ్‌ సోకినట్లు సీఎస్‌ స్వయంగా వెల్లడించారు. నిత్యం వివిధ శాఖలతో ఎడతెరిపి లేని సమీక్షలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన, కాస్త అస్వస్థతగా ఉండటంతో కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో వైరస్‌ బారిన పడినట్లు తేలింది. మూడు రోజుల క్రితమే ఆయన ఫస్ట్ డోస్ వాక్సిన్ తీసుకున్నట్లు సమాచారం. ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో రోజువారీ కార్యకలాపాలకు కొన్నిరోజులు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల సీఎస్‌ను కలిసిన వారిలో ఎవరికైనా లక్షణాలు ఉన్నట్లయితే తక్షణమే కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

 

TELANGANA CORONA NEWS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article