తెలంగాణా ఎలక్షన్ ఎఫెక్ట్

Telangana Election Effect ..  ఏపీలో టీడీపీ కాంగ్రెస్ పొత్తు లేనట్టే

తెలంగాణ ఎన్నికల ఎఫెక్ట్  ఏపీ ఎన్నికల పొత్తుల పైన బాగానే పని చేసినట్టు ఉంది. అందుకే రానున్న ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ టిడిపి పొత్తులపైనా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న మొన్నటి వరకు పొత్తులతో పోటీ చేస్తారా  లేక ఒకరికొకరు సహకరించుకుంటారా  అని ఆలోచించారు ఏపీ ప్రజలు.ఇక  ఈ నేపథ్యంలో  పార్టీ శ్రేణులకు టిడిపి కాంగ్రెస్ పొత్తులపై చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా పోటీచేసిన కాంగ్రెస్ టీడీపీలు అక్కడ కోలుకోలేని విధంగా దెబ్బ తిన్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఏపీలో కొత్త విషయాలు నిర్ణయాధికారాన్ని చంద్రబాబు నాయుడికి వదిలివేయడంతో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్-టీడీపీ పొత్తు ల తో పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుంది అన్న దానిపై సర్వే నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ టిడిపి  పొత్తులతో పోటీ చేస్తే   టీడీపీకి ఏ విధంగానూ ప్రయోజనం లేదని  తేలింది.
గత ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా వేరు చేసినందుకు ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించారు.  దీంతో అప్పటి నుండి ఏపీలో ఆ పార్టీ కోలుకోలేని స్థితిలో ఉంది. ఇక తాజాగా రాహుల్ గాంధీ ఏపీ పర్యటనలో భాగంగా తెలుగు రాష్ట్రాలను విభజించిన అందుకుగాను వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తమ నిర్ణయాన్ని వెల్లడించారు. అయినప్పటికీ ఇంకా ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేక భావన ఉంది.  ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది అంతుచిక్కకుండా నే ఉంది. ఇక టిడిపి అధినేత చంద్రబాబు పొత్తుల అంశంపై లాభనష్టాలను బేరీజు వేసి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తో ఏపీలో విడివిడిగా పోటీ చేసి అవసరమైతే  మద్దతు పెట్టుకుందాం అని చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇక దేశ రాజకీయాల్లో మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్ గా బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం ఒకటిగా కలిసి  తాగుదామని చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీకి తెలియజేసినట్లు గా తెలుస్తుంది. తెలంగాణ ఎన్నికల ప్రభావంతోనే ఏపీ ఎన్నికలపై ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీపై ఏపీలో ఇంకా ఆగ్రహం చల్లారక పోవడంతో  పొత్తులతో వెళ్లకపోవడమే మంచిది అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తుంది. దీంతో ఏపీలో టిడిపి ఒంటరి పోరు చేయబోతుందని కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేనట్టే అని తేలిపోయింది.  ఇక జాతీయ రాజకీయాల్లో మాత్రమే టిడిపి కాంగ్రెస్ తో పని చేయబోతున్నట్లు గా చంద్రబాబు నాయుడు తేల్చేశారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article