ఈవీ పాలసీ ప్రత్యేకతలేంటి?

47
Actor VijayaDevarakonda @ Telangana EV Policy Launch
TELANGANA EV POLICY FEATURES

Telangana EV Policy Highlights

పరిశ్రమకు రాయితీలు
1. రూ. 200 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ చేపట్టే పరిశ్రమలకు రూ. 30 కోట్లకు తగ్గకుండా 20 శాతం పెట్టుబడి సబ్సిడీ
2. రూ. 25 కోట్లకు తగ్గకుండా ఏడేళ్లపాటు జీఎస్టీ తిరిగి చెల్లింపు
3. ఐదేళ్ల పాటు రూ. 5 కోట్ల పరిమితితో 25 శాతం విధ్యుత్ సబ్సిడీ
4. రూ. 5 కోట్లకు తగ్గకుండా ఐదేళ్ల పాటు 60 శాతం రవాణా రుసుము, రూ. 5 కోట్లకు తగ్గకుండా 5.25 శాతం వడ్డీ రాయితీ
5. పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ వాహనాల తయారీ, ఇంధన నిల్వల కంపెనీలకు ప్రోత్సాహం
6. స్టాంపు బదిలీ డ్యూటీలు, రిజిస్ట్రేషన్ రుసుముల నుండి మినహాయింపు
7. కొత్తరకం ఎలక్ట్రిక్ వాహనాల తయారు కోసం పరిశోధన అభివృద్ధి కేంద్రాల స్థాపన, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు

కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలు
1. తెలంగాణాలో తయారైన ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు జరిగే తొలి 2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు అలాగే మొదటి 20 వేల ఆటోలకు, 5 వేల నాలుగు చక్రాల వాహనాలకు, 10 వేల తేలికపాటి రవాణా వాహనాలకు, 5 వేల కార్లకు, 500 బస్సులకు వందశాతం రిజిస్ట్రేషన్, రోడ్డు టాక్సీ నుండి మినహాయింపు
2. రాష్ట్రంలో కొనుగోలు చేసి నమోదు చేసుకునే ట్రాక్టర్లకు రోడ్డు టాక్సీ, రిజిస్ట్రేషన్ రుసుము 100 శాతం మినహాయింపు
3. పారిశ్రామిక లాజిస్టిక్స్, రవాణా కేంద్రాల పరిధిలో రాత్రిపూట పార్కింగ్ మరియు ఛార్జింగ్ సదుపాయాల కల్పన
4. ఆటోలకు అదనంగా ఫిట్మెంట్ రాయితీల కింద రూ. 15 వేలకు మించకుండా 15 శాతం రాయితీ

ఛార్జింగ్ సౌకర్యాలు
1. హైదరాబాద్ ఇతర పట్టణాల్లో వాహనాలకు ప్రత్యే ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు
2. రాష్ట్ర విధ్యుత్ నియంత్రణ సంస్థ ద్వారా ఛార్జింగ్ కేంద్రాలకు ప్రత్యేక ఫీజు వసూలు
3. టౌన్ షిప్ లలో ఛార్జింగ్ కేంద్రాల స్థాపనకు వెసులుబాటు
4. మహా నగరాలకు వెళ్లే జాతీయ రహదారుల పక్కన ప్రతీ 50 కిలోమీటర్ల చొప్పున ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు
5. ఆర్టీసీ, మెట్రో రైల్ సంస్థలు తమ డిపోల దగ్గర ద్విచక్ర వాహనాలకు ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు

 

#ActorVijayaDevarakonda@TelanganaEVPolicy

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here