తెలంగాణలో ప్రప్రథమ కరోనా మరణం

TELANGANA FIRST CORONA DEATH

కరొనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని.. కుత్బుల్లాపూర్ ఏరియా నుంచి ఒకటే కుటుంబం నుంచి నాలుగు కేసులు నమోదు అయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. అయితే, కరొనా ఇప్పటి తెలంగాణ ప్రజలకు సోకలేదని, దీన్ని కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి సమాచారం మాకు అందించాలని, సీఎం ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారని చెప్పారు. కేవలం శనివారమే కొత్తగా 6 కేసులు కొత్తగా వచ్చాయని,  కరోనా కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఒక వ్యక్తి మరణించారని చెప్పుకొచ్చారు. సీరియస్ కండిషన్ లో గ్లోబల్ హాస్పిటల్ లో చేరారని, అతను మరణించిన తర్వాత కరోనా వచ్చిందన్నారు. ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికపుడు అందుబాటులో పెడుతామన్నారు.

ఏ హాస్పిటల్ లో ఎలాంటి సమస్య లేదని.. కరొనా పై తప్పుడు ప్రచారం చేయవద్దన్నారు. ఇప్పటి వరకు 65 కు కొరొనా కేసులు నమోదయ్యాయని తెలిపారు. కొరొనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందన్నారు. కుత్బుల్లాపూర్ ఏరియా నుంచి ఒకటే కుటుంబం నుంచి నాలుగు కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి సమాచారం తమకు అందించాలన్నారు. సీఎం ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారని చెప్పారు. ఎంతమంది కొరొనా రోగులు ఉన్నా ట్రీట్మెంట్ అందిస్తామని, కావాల్సిన యంత్రపరికారాలు అన్ని అందుబాటులో తెస్తున్నామని చెప్పారు. 6 రోజుల్లో గచ్చిబౌలి లో స్పోర్ట్స్ కాంప్లెక్ రెడి అవుతుందని చెప్పారు.

* గాంధీ వైద్యులకు వారి వారి ఏరియాల్లో ప్రజలెవ్వరు ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. అలాంటి వైద్యులకు అండగా ఉండాలన్నారు. క్వారంటైన్లో ఉన్న వారి సంఖ్య తగ్గుతుందన్నారు. ఒక్క వ్యక్తికి వస్తే కుటుంబం అంతా వచ్చే ప్రమాదం ఉందన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు బాధ్యతగా ఉండాలని, సీఎం ఆదేశాలతో 24 గంటలు ఆన్ డ్యూటీ లో ఉంటున్నామని చెప్పారు. హైదరాబాద్ లో ఎక్కడ రెడ్ జోన్ లేదని, ప్రార్థన మందిరాల్లోకి ప్రజాలేవరూ వెళ్ళవద్దని సూచించారు. ఇవ్వాళ నమోదు అయిన కేసుల్లో మూడు కేసులు ఢిల్లీ ప్రార్థన మందిరాల్లోకి వెళ్లిన వారివేనని చెప్పారు. వైద్యులు- ఎయిర్ పోర్ట్ లోని స్క్రినింగ్ లో పనిచేసే సిబ్బంది- వారి కుటుంబాలకు కరొనా సోకిందన్నారు. రోగుల దగ్గర పని చేసే సిబ్బంది-వ్యక్తులు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో పని చేసే సిబ్బందికి షిఫ్ట్ లాగా విధులు నిర్వహించే లాగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. వైద్యులకు అవసరం అయితే 10 రోజులు విధులు..మరో పది రోజులు లీవ్ ఇస్తామని తెలిపారు. క్వారంటైన్లో 13వేల మంది ప్రస్తుతం ఉన్నారు. రోజు రోజుకు క్వారంటైన్లో సంఖ్య తగ్గుతుందన్నారు.

TELANGANA FIRST CORONA DEATH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *