Telangana Government importance for womens in Local Companies
మహిళలకు సరైన ప్రాతినిధ్యం కల్పించటం కోసం తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు అగ్రతాంబూలం ఇచ్చింది . ఈ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. జడ్పీ చైర్మన్ స్థానాల్లో సగానికి సగం మహిళలకే కేటాయించింది. 33 జిల్లాలకు సంబంధించి జడ్పీ పీఠాలపై కూర్చునే అవకాశాన్ని అధికశాతం.. మహిళలకే కల్పిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 32 జడ్పీ చైర్మన్లకు గాను.. ఎస్సీలకు 6, ఎస్టీలకు 4, బీసీలకు 6, జనరల్ కేటగిరీకి 16 స్థానాలు కేటాయించింది. అన్ని సామాజిక వర్గాల్లోనూ మహిళలకే పెద్ద పీఠ వేయడం విశేషం. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లాల వారిగా చూస్తే కరీంనగర్ -ఎస్సీ మహిళ, నాగర్ కర్నూల్ – ఎస్సీ మహిళ, ఖమ్మం – ఎస్సీ మహిళ, పెద్దపల్లి – బీసీ జనరల్, నారాయణపేట – బీసీ జనరల్, జగిత్యాల – బీసీ జనరల్, జోగులాంబ గద్వాల – బీసీ మహిళ, మెదక్ – బీసీ మహిళ, కామారెడ్డి – బీసీ మహిళ, సిద్దిపేట – జనరల్ మహిళ, సంగారెడ్డి -జనరల్ మహిళ, యాదాద్రి భువనగిరి – జనరల్, నిజామబాద్ – జనరల్, మహబూబ్ నగర్ -జనరల్, మేడ్చల్ మల్కాజ్గిరి – జనరల్, వికారాబాద్ -జనరల్ మహిళ, రంగారెడ్డి – జనరల్ మహిళ, నల్గొండ – జనరల్, సూర్యాపేట – జనరల్ మహిళ, ములుగు – జనరల్, భద్రాద్రి -ఎస్టీ జనరల్, జనగామ -జనరల్, నిర్మల్ – జనరల్ మహిళ, మహబూబాబాద్ – ఎస్టీ మహిళ, ఆదిలాబాద్ ఎస్టీ జనరల్, కొమర భీం అసిఫాబాద్- ఎస్టీ మహిళ, మంచిర్యాల – ఎస్సీ మహిళ, వరంగల్ అర్బన్ – ఎస్సీ జనరల్, వరంగల్ రూరల్ -జనరల్ మహిళగా పంచాయితీ రాజ్‌శాఖ రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ మేరకు ఉత్వర్లు జారీ చేసింది
Latest Interesting Telugu News Tsnews
For More New