Sunday, September 29, 2024

ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ ఫొటో పెట్టండి: కాంగ్రెస్ సర్కార్

  • వచ్చేనెల 07వ తేదీ లోపు అన్ని ప్రభుత్వ కార్యాయాల్లో
  • సిఎం రేవంత్‌రెడ్డి ఫొటోను ఏర్పాటు చేయాలి
  • ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

సిఎం రేవంత్ రెడ్డి ఫొటోను అన్ని ప్రభుత్వ కార్యాయాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఫొటో ఏర్పాటుకు అక్టోబర్ 7వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, డివిజన్, మండల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వం ఫైనల్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోను మాత్రమే ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు, డివిజన్, మండల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సిఎం రేవంత్ రెడ్డి ఫొటో నమూనాను సైతం విడుదల చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో సిఎం ఫొటో పెట్టాలని సూచించింది. ఇప్పటికే కొందరు నాయకులు ప్రభుత్వ కార్యాలయాల్లో సిఎం రేవంత్ రెడ్డి ఫొటో లేదని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో వచ్చే నెల 7వ తేదీ వరకు ఫొటోను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తయినప్పటికీ ప్రభుత్వ కార్యాలయాల్లో సిఎం రేవంత్ రెడ్డి ఫొటో లేకపోవడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular