తెలంగాణలో వెదురు సాగు

Telangana Govt To Promote Bamboo Cultivation

తెలంగాణలో వెదురు ( బ్యాంబు ) సాగుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. వెదురును అనేక రూపాలుగా వినియోగించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సమాయత్తమయ్యారు. అందుకోసం వెదురు నిపుణుల బృందంతో కలిసి మహారాష్ట్రలోని సింధ్ దుర్గ్ జిల్లా కుడాల్ తాలూకా శివారులో ఉన్న వెదురు పరిశ్రమలు, క్షేత్రాలను వినోద్ కుమార్ రెండు రోజుల పాటు సందర్శించారు.

అక్కడి రైతులతో వెదురు సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుడాల్ పట్టణ పారిశ్రామికవాడలోని కొంకన్ వెదురు పరిశ్రమలను పరిశీలించారు. 2004 లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ బ్యాంబు మిషన్ ను ఏర్పాటు చేసి పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఆ మిషన్ ను మరింత బలోపేతం చేస్తూ 2017 లో కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర నిర్ణయం బ్యాంబు సాగుకు మరింత ఊతమిచ్చింది. ఈ అవకాశాలను ఉపయోగించుకుని మహారాష్ట్ర కుడాల్ ప్రాంత రైతులు బ్యాంబు సాగును పెంచారు. తద్వారా మెరుగైన లాభాలను ఆర్జిస్తున్నారు. మహారాష్ట్రలోని కుడాల్ ప్రాంత వెదురు సాగు విజయగాథను బోయినపల్లి వినోద్ కుమార్ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం స్వయంగా గమనించింది. ప్రస్తుతం వెదురుకు ఉన్న విశిష్ట ప్రాముఖ్యతను గుర్తించింది.

వెదురు ( బ్యాంబు ) చెట్టు కాదు. వెదురు ఒక రకమైన గడ్డి జాతి మొక్క. ఇది దుంప లాగా పెరుగుతుంది. ఎన్నిసార్లు కోసినా మళ్ళీ మళ్ళీ మొలకెత్తుతుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితులు అయినా ఎదుర్కొని వెదురు మొలకెత్తుతుంది. వెదురును నాటిన రోజు నుంచి నాలుగో సంవత్సరానికి బ్యాంబు క్రాప్ కోతకు సిద్ధమవుతుంది. ప్రతి ఏడాది కోతకు వస్తుంది. ఎన్ని సంవత్సరాలు అయినా వెదురుకు ఎదురు ఉండదు. ప్రతి ఏడాది ఆదాయం వస్తుంది.

ఇతర మొక్కల కన్నా వెదురు ఎక్కువగా ఆక్సిజన్ ను అందించి కార్బన్ దయాక్సిడ్ ను పీలుస్తుంది. రాళ్లు, రప్పలుగా ఉన్న భూముల్లోనూ వెదురు అవలీలగా పెరుగుతుంది. వ్యవసాయానికి యోగ్యం కాని భూముల్లో కూడా వెదురు పెరుగుతుంది. ఆక్సిజన్ ను అందించే సుగుణమ్ కలిగి ఉండటం, బహుళ విధాలుగా వెదురు వినియోగం వల్ల మార్కెట్ లో దీనికి ప్రత్యేకత సంతరించుకుంది.

Telangana Govt To Promote Bamboo Cultivation,Bamboo cultivation to be encouraged,Telangana Bamboo,Vindo Kumar,#bambooaged,Farmers,National Bank Mission

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article