Telangana In Deep Financial CRISIS
తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని, పరిపాలన అస్తవ్యస్థంగా తయారు చేశారని మండిపడ్డారు .మాజీ మంత్రివర్యులు పొన్నాల లక్ష్మయ్య. కల్పవృక్ష మైన హైదరాబాదు ఆదాయం తో ధనిక రాష్ట్రంగా కెసిఆర్ చేతిలో పెడితే అప్పుల కుప్ప చేశారని ఆయన ఆరోపించారు. రెండు లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజలను నిలువునా ముంచారు అని పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
* తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి కాసులు లేవని, ఆరోగ్యశ్రీ సేవల బంద్ అయ్యాయని, 108 ఉద్యోగులకు జీతాలు లేవని ఆయన మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. రైతులకు రైతుబంధు నగదు ఇంతవరకు అందలేదని , రుణమాఫీకి కార్యాచరణ ఇంకా ప్రారంభం కాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని సర్కార్ నీరుగారుతుందని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. కనీస అంగన్వాడీ కేంద్రాలలో బాలింతలకు పాలు, పౌష్టికాహారం సరఫరా కూడా నిలిపివేశారని పేర్కొన్న పొన్నాల లక్ష్మయ్య ఇది ప్రజారంజక పాలనా ? అని ప్రశ్నించారు.
* తొమ్మిది మాసాలుగా సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వకపోవడం అభివృద్ధికి సంకేతమా అని నిలదీశారు. తన అవసరాలకు తగ్గట్టుగా చట్ట సవరణ చేసి ప్రజలకు మేలు చేకూరుస్తుందని చెప్పడం కెసిఆర్ తెలివితేటలకు నిదర్శనం అన్నారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా కెసిఆర్ ని నమ్ముకున్న ప్రజలు ఓట్లు వేస్తే ఇప్పుడు రాష్ట్రాన్ని నిలువునా ముంచుతున్నారు అని పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. మునిసిపల్ చట్ట సవరణ విషయంలో న్యాయస్థానాలు ప్రశ్నించిన తీరు, గవర్నర్ నిర్ణయం కెసిఆర్ కు చెంపపెట్టు కాదా అని ఆయన ప్రశ్నించారు. అడ్డగోలు విలాసాలు, కూల్చివేతలు, కొత్త భవనాల నిర్మాణాలు కెసిఆర్ మూఢనమ్మకాలకు నిదర్శనమన్నారు. అవగాహన లేని పాలన చేస్తూ, రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మార్చారని పొన్నాల లక్ష్మయ్య కెసిఆర్ పాలన పై విరుచుకుపడ్డారు.