అప్పుల రాష్ట్రంగా తెలంగాణా

Telangana is in debt

తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారింది . విభజన తర్వాత మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణా ఇప్పుడు అప్పుల కుప్పగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే తెలంణ ప్రభుత్వ అప్పులు భారీగా పెరిగిపోయాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది మార్చి నాటికి 159% అప్పులు పెరిగాయని రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర అప్పులుపై కాంగ్రెస్ ఎంపీ ఎంఏఖాన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రం ఏర్పడిననాటికి తెలంగాణ అప్పులు రూ.69వేల కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.లక్ష 80వేల కోట్లకు పెరిగిపోయాయని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌ ప్రకారం 2014 జూన్‌ 2 నాటికి అంటే రాష్ట్రం ఏర్పడేనాటికి రాష్ట్రంపై రూ. 69,517 కోట్లు అప్పులు ఉన్నాయని అవి కాస్త 2019 మార్చి చివరినాటికి రూ. 1,80,239 కోట్లకు పెరిగిపోయాయని తెలిపారు. మరోవైపు విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కమ్‌ల) అప్పులను టేకోవర్‌ చేయడానికి వీలుగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి అప్పులు తీసుకోవడానికి రాష్ట్రాలకు ఒకసారి అనుమతించామని, అందులో ఉదయ్‌ పథకం కింద 2016-17లో రూ. 8923 కోట్ల అదనపు రుణం తీసుకోవడానికి తెలంగాణకు అనుమతించినట్లు తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article